Inter Exams: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్ వివరాలు ఇలా తెలుసుకోండి
రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరు కానున్నారు. ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లు కాలేజీ లాగిన్లలో అందుబాటులో ఉన్నాయి.
Students Representative Image (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 25వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం
- 9.9 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరుకానున్నారు
- పొరపాట్లు ఉంటే సవరణ కోసం ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు తెలపాలి
Inter Exams: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. మార్చి 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. మొత్తం 9.9 లక్షల హాల్ టికెట్స్ రిలీజ్ చేసింది. విద్యార్థులు తమ కాలేజీలలో హాల్ టికెట్స్ పొందొచ్చు. హాల్ టికెట్ పై ఉండే క్యూఆర్ కోడ్ సాయంతో ఎగ్జామ్స్ సెంటర్ ను తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 25వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరు కానున్నారు. ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లు కాలేజీ లాగిన్లలో అందుబాటులో ఉన్నాయి.
హాల్ టికెట్లు కాలేజీల ప్రిన్సిపాల్స్ దగ్గర నుండి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సవరణ కోసం ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. హాల్ టికెట్‌పై ఉండే QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు SMS లింక్ ద్వారా డౌన్లోడ్ సౌకర్యం కూడా కల్పించారు.
