Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. మహిళల క్రికెట్లో ఏకైక ప్లేయర్..
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) అరుదైన ఘనత సాధించింది.
Harmanpreet Kaur Becomes Most Capped International Player In Womens Cricket
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. గురువారం కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత అందుకుంది. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్ రికార్డును బ్రేక్ చేసింది.
బేట్స్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరుపున 355 మ్యాచ్‌లు ఆడింది. ఇక హర్మన్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్ భారత మహిళా కెప్టెన్‌కు 356వ అంతర్జాతీయ మ్యాచ్.
3⃣5⃣6⃣* matches of utmost commitment and determination 🫡
Congratulations to #TeamIndia captain Harmanpreet Kaur on becoming the most-capped international player in women’s cricket 👏👏 #AUSvIND | @ImHarmanpreet pic.twitter.com/wMfgOE6AFU
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
2009 మార్చి 7న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. ఆమె ఇప్పటి వరకు భారత్ తరుపున 6 టెస్టులు, 161 వన్డేలు, 189 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 200 పరుగులు, వన్డేల్లో 4409 పరుగులు, టీ20ల్లో 3784 పరుగులు చేసింది. అంతేకాదండోయ్ టెస్టుల్లో 12 వికెట్లు, వన్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో 32 వికెట్లు తీసింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే..
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 356 మ్యాచ్‌లు
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 355 మ్యాచ్‌లు
* ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – 349 మ్యాచ్‌లు
* మిథాలీ రాజ్ (భారత్) – 333 మ్యాచ్‌లు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 305 మ్యాచ్‌లు
* హీథర్ నైట్ (ఇంగ్లాండ్) – 303 మ్యాచ్‌లు
