INDW vs AUSW : టీమ్ఇండియాకు షాక్.. ఆసీస్తో రెండో టీ20 మ్యాచ్లో ఓటమి
కాన్బెర్రా వేదికగా గురువారం భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో (INDW vs AUSW ) ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
INDW vs AUSW 2nd T20 Australia Women won by 19 runs
INDW vs AUSW : కాన్బెర్రా వేదికగా గురువారం భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతానికి 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య శనివారం (ఫిబ్రవరి 21) అడిలైడ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Australia gets its first win in the Sophie Molineux era 🔥 #AUSvIND
Match centre: https://t.co/sAsQ94Kbqz pic.twitter.com/wgPzoKieQr
— cricket.com.au (@cricketcomau) February 19, 2026
Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. మహిళల క్రికెట్లో ఏకైక ప్లేయర్..
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ (29; 23 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతి మంధాన (31; 24 బంతుల్లో 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు.
జెమీమా రోడ్రిగ్స్ (4), దీప్తిశర్మ (0) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్ మూడు వికెట్లు తీసింది. కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్ లు తలా రెండు వికెట్లు తీశారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్ (88; 57 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్ ఓ వికెట్ పడగొట్టింది.
