×
Ad

INDW vs AUSW : టీమ్ఇండియాకు షాక్.. ఆసీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఓట‌మి

కాన్‌బెర్రా వేదిక‌గా గురువారం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (INDW vs AUSW ) ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది.

INDW vs AUSW 2nd T20 Australia Women won by 19 runs

INDW vs AUSW : కాన్‌బెర్రా వేదిక‌గా గురువారం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్ర‌స్తుతానికి 1-1తో స‌మ‌మైంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 21) అడిలైడ్ వేదిక‌గా మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Harmanpreet Kaur : చ‌రిత్ర సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌.. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్..

164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఆసీస్ 19 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ (29; 23 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతి మంధాన (31; 24 బంతుల్లో 4 ఫోర్లు), హర్మ‌న్ ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు.

జెమీమా రోడ్రిగ్స్ (4), దీప్తిశ‌ర్మ (0) లు విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆష్లీ గార్డనర్ మూడు వికెట్లు తీసింది. కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్‌8కి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. ఏ గ్రూప్‌లో ఏ జ‌ట్టు ఉందంటే ? షెడ్యూల్ ఇదే..

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో జార్జియా వాల్ (88; 57 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), బెత్ మూనీ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అరుంధ‌తి రెడ్డి రెండు వికెట్లు తీయ‌గా.. రేణుకా సింగ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.