iPhone 15 Pro Models : భారీ ధరలతో రానున్న ఐఫోన్ 15 ప్రో మోడల్స్.. కొత్త ఐఫోన్లలో ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

iPhone 15 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో అనేక మోడళ్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్స్ కూడా రానున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌ ఇప్పట్లో లేదనే చెప్పాలి.

iPhone 15 Pro Models : భారీ ధరలతో రానున్న ఐఫోన్ 15 ప్రో మోడల్స్.. కొత్త ఐఫోన్లలో ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

iPhone 15 Pro models could get a huge price increase, here is what we know

iPhone 15 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో అనేక మోడళ్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్స్ కూడా రానున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌ ఇప్పట్లో లేదనే చెప్పాలి. రాబోయే ఐఫోన్‌ల లీక్‌లు, ధరలపై ఆన్‌లైన్‌లో రుమర్లు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్‌ (iPhone 15 Plus)లకు ఈ ఏడాదిలో కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లు లభిస్తాయని చెబుతున్నారు. ఈ ఫోన్‌లు ప్రో మోడల్‌ల నుంచి కొన్ని ప్రీమియం ఫీచర్‌లతో రావొచ్చు.

ఈ ఏడాదిలో ఐఫోన్ మోడల్‌లతో పోలిస్తే.. రాబోయే ఈ కొత్త ఐఫోన్ హ్యాండ్‌సెట్‌ల ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. Weibo నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లకు భారీ ధర పెరుగుతుందని పేర్కొంది. MacRumors నివేదిక ప్రకారం.. Apple ధర, ఫీచర్ల పరంగా కూడా ప్రామాణికం, ప్రో మోడల్‌ల మధ్య మరింత పెద్ద అంతరాన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు. ఐఫోన్ 14 ప్రో భారత మార్కెట్లో రూ. 1,29,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర రూ. 1,39,900గా ఉంది.

ఇప్పుడు కొత్త రుమర్ నిజమని తేలితే.. ఐఫోన్ 15 ప్రో మోడల్‌ ధర గత ఏడాదిలో ఐఫోన్ మోడళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ లక్ష్యంగా ధర పరిధిని వెల్లడించలేదు. కానీ, మునుపటి లీక్‌లను పరిశీలిస్తే.. ఈ ఏడాదిలో Apple iPhone Pro Max మోడల్‌ను కొత్త అల్ట్రా మోడల్‌తో భర్తీ చేస్తుందని పుకార్లు వస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగదారులకు అన్నింటిలో బెస్ట్ అని చెప్పవచ్చు. లీక్‌ల ప్రకారం.. పాత మోడల్‌తో పోల్చితే.. Apple iPhone 15 Ultra ధరను 200 డాలర్లు పెంచనుంది.

iPhone 15 Pro models could get a huge price increase, here is what we know

iPhone 15 Pro models could get a huge price increase

Read Also : iPhone 11 Sale Offer : Cashify బంపర్ సేల్.. రూ. 21వేలకే ఐఫోన్ 11 సొంతం చేసుకోవచ్చు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. వెంటేనే కొనేసుకోండి!

iPhone 15 Ultra ధర 1,299 డాలర్లుగా ఉంటుందని నివేదిక తెలిపింది. అంటే ఈ ఐఫోన్ మోడల్ ధర భారత మార్కెట్లో దాదాపు రూ. 1,07,330గా ఉంటుంది. భారతీయ మార్కెట్‌లో దీని ధర అదే విధంగా ఉంటుందని కస్టమ్ డ్యూటీ ఛార్జ్ వంటి మరిన్ని కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పలేం. ఆపిల్ iPhone 14 Pro Max భారత మార్కెట్లో రూ. 1,39,900 ధర ట్యాగ్‌తో లాంచ్ అయింది. అదే డివైజ్ అమెరికాలో 1,099 డాలర్లు (సుమారు రూ. 90,810)కి అందుబాటులోకి వచ్చింది.

ఇతర ఐఫోన్ మోడళ్లకు నిర్దిష్ట ధర లీక్‌లు లేవు. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ధర 999 డాలర్లు (సుమారు రూ. 81,700) నుంచి మొదలవుతుంది. Apple iPhone 15 Pro మోడల్ ధరను పెంచాల్సి వస్తే.. ప్రస్తుత మోడల్ కన్నా కనీసం 100 డాలర్లు ఎక్కువగా ఉండవచ్చు. Apple సాధారణంగా ధరను కనీసం 100 డాలర్ల వరకు పెంచుతుంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్‌లు పాత ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ 12 ధర 100 డాలర్లకి పెరిగింది. దీని ధర 799 డాలర్లుగా ఉంది.

రెండు సంవత్సరాలుగా వరుసగా పాత ధరలకే కొత్త ఫోన్‌లను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ధరను పెంచే ఆలోచనలో ఆపిల్ దిగ్గజం ఉన్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. ఆపిల్ iPhone 15 Pro ధర 1,099 డాలర్లు కావచ్చు. ఈ ఏడాదిలో హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లతో మెరుగైన మరిన్ని ప్రీమియం ఫీచర్లను అందిస్తే.. ఆపిల్ ఐఫోన్ మోడల్ ధరను పెద్ద మార్జిన్‌తో పెంచాలని నిర్ణయించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్రో ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 1,29,900కి విక్రయిస్తోంది. అదే నిజమైతే.. పాత ఐఫోన్ మోడల్ కన్నా రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 15 Pro Series : సరికొత్త ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. అవేంటో తెలుసా?