Apple iPhone 15 Pro Series : సరికొత్త ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. అవేంటో తెలుసా?

Apple iPhone 15 Pro Series : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) గత ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. రాబోయే ఐఫోన్ సిరీస్ ఇప్పటికే హ్యాండ్‌సెట్‌ల ఫీచర్లకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Apple iPhone 15 Pro Series : సరికొత్త ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. అవేంటో తెలుసా?

Apple iPhone 15 Pro series might come with Titanium frame, Taptic Button

Apple iPhone 15 Pro Series : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) గత ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. రాబోయే ఐఫోన్ సిరీస్ ఇప్పటికే హ్యాండ్‌సెట్‌ల ఫీచర్లకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15pro Max) పూర్తిగా కొత్త ఫీచర్లతో రావచ్చని లేటెస్ట్ రిపోర్టు సూచిస్తుంది.

మ్యాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ టైటానియం ఫ్రేమ్, టాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో సాలిడ్ స్టేట్ బటన్లు, భారీ ర్యామ్‌తో వస్తాయని సాంకేతిక విశ్లేషకుడు Jeff Pu అంచనా వేశారు. నివేదిక ప్రకారం.. హాంకాంగ్ ఆధారిత సంస్థ హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ పరిశోధన నోట్‌లో ఐఫోన్ ప్రో సిరీస్ ఫీచర్లను అంచనా వేసింది.

9To5Mac నివేదిక ప్రకారం.. కాలిఫోర్నియా ఆధారిత కంపెనీ iPhone 15, iPhone 15 Plus కెమెరాను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోందని తెలిపింది. ఈ డివైజ్‌ల్లో iPhone 14 ప్రో మోడల్‌ల రిజర్వ్ చేసిన అదే కెమెరా సెన్సార్‌లను పొందవచ్చు. అదేగాని నిజమైతే.. ఆపిల్ iPhone 15, iPhone 15 Plus 48MP వైడ్ లెన్స్‌తో 3-స్టాక్డ్ బ్యాక్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

Apple iPhone 15 Pro series might come with Titanium frame, Taptic Button

Apple iPhone 15 Pro series might come with Titanium frame

Read Also : Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!

అంతేకాకుండా, iPhone 15 మోడల్‌లు ఆప్టికల్ జూమ్ లేదా LiDAR స్కానర్లతో టెలిఫోటో లెన్స్‌తో రాకపోవచ్చని నివేదిక తెలిపింది. MacRumours నివేదిక ప్రకారం.. iPhone 15 సిరీస్ బేస్ మోడల్ ఆపిల్ iPhone 15, iPhone 15 Plus సహా ఇతర మోడల్ iPhone 14, iPhone 14 Plus కన్నా చౌకగా ఉండవచ్చని సూచించింది.

టిప్‌స్టర్ yeux1122 నివేదిక ప్రకారం.. కుపెర్టినో-ఆధారిత కంపెనీ నెక్స్ట్ ప్లస్ ఐఫోన్‌ను అందించనుంది. నివేదిక ప్రకారం.. ప్రో, నాన్-ప్రో మోడల్‌ల మధ్య వ్యత్యాసాన్ని పెంచే మొదటి ఆప్షన్ కావచ్చు. ఐఫోన్ 15 ప్లస్‌ కావాలంటే పెద్ద స్క్రీన్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను మరింత సరసమైన ధరకే అందించాలని ఆపిల్ భావిస్తోంది.

ప్రస్తుతం iPhone 14 Plus ధర 128GB స్టోరేజ్ బేస్ మోడల్‌కు రూ. 89,900 నుంచి ఉంది. అదేవిధంగా, iPhone 14 ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఈ రెండు డివైజ్‌లను ఆపిల్ మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోందని నివేదిక పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Discount Offer : ఫ్లిప్‌కార్ట్‌లో న్యూ ఇయర్ ఆఫర్.. ఐఫోన్ 14పై ఎప్పుడూ లేనంతగా భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైం.. వెంటనే కొనేసుకోండి!