Mahesh Babu : జిమ్‌లో మహేష్ కసరత్తులు రాజమౌళి సినిమా కోసమేనా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటినుంచే మేక్ ఓవర్ మొదలు పెట్టేశాడు.

Mahesh Babu : జిమ్‌లో మహేష్ కసరత్తులు రాజమౌళి సినిమా కోసమేనా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Mahesh Babu

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ నెలతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి పూర్తిగా బయటకి రానున్నాడు. ఆ తరువాత మహేష్ సినిమా పై మొత్తం ద్రుష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు విజయేంద్ర ప్రసాద్ సాగిస్తున్నాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ సబ్జెట్ తో ఉండబోతున్నట్లు రాజమౌళి ఇప్పటికే తెలియజేశాడు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం జగ్గుభాయ్ సరికొత్త మేకోవర్!

ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా కోసం హాలీవుడ్ లోని పలు సంస్థలతో కూడా రాజమౌళి చెయ్యి కలుపుతున్నాడు. ఇది ఇలా ఉంటే.. మహేష్ బాబు తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో మహేష్ జిమ్ లో భారీ కసరత్తులు చేసి కండలతో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. రాజమౌళి సినిమా కోసం ఇప్పటినుంచే మేక్ ఓవర్ మొదలు పెట్టావా అన్నా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా SSMB28 కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఇటీవలే యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, నెక్స్ట్ షెడ్యూల్ లో ఫ్యామిలీ అండ్ లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ మహేష్ అమ్మ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే జగపతిబాబు విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)