Pushpa 2 : పుష్ప-2లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నిజమేనా?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప ది రైజ్'. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా..

Pushpa 2 : పుష్ప-2లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నిజమేనా?

is sai pallavi play a important role in pushpa 2

Pushpa 2 : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప ది రైజ్’. అల్లు అర్జున్ నటించిన ఈ రీజినల్ సినిమా పాన్ ఇండియా హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Allu Arjun : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లైవ్ కాన్సర్ట్ లో నెదర్లాండ్ సింగర్‌తో కలిసి స్టెప్పులేసిన బన్నీ..

దీంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించబోతుంది అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది అంటూ వార్తలు వచ్చిని. మళ్ళీ ఇప్పుడు ఆ వార్తలు తెరపైకి వచ్చాయి. ఒక ముఖ్య పాత్ర కోసం సుకుమార్ ఆమెను సంప్రదించగా, సాయి పల్లవి కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. ఈ షెడ్యూల్ లోనే సాయి పల్లవి పాల్గొనుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో #SaiPallavi, #PushpaTheRule హ్యాష్ ట్యాగ్ లు ట్రేండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. కాగా వచ్చే నెల 8వ తారీఖు అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు విపిస్తున్నాయి.