Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. కథ నచ్చితే చాలు, ఆ క్యారెక్టర్ కి తనని తాను మార్చుకుని ఒదిగి పోతాడు. ఇక తాజా సినిమాలో ఇప్పటి వరకు కనిపించని సరి కొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' సినిమాలో..

Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?

Sudheer Babu

Sudheer Babu : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. కమర్షియల్ అండ్ లవ్ మూవీస్ లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కథ నచ్చితే చాలు.. ఆ క్యారెక్టర్ కి తనని తాను మార్చుకుని ఒదిగి పోతాడు. ఇక తాజా సినిమాలో ఇప్పటి వరకు కనిపించని సరి కొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ నుంచి ఇటీవల ఒక వీడియో లీక్ అవ్వడంతో.. సినిమాలోని సుధీర్ బాబు లుక్ రివీల్ అయ్యిపోయింది.

Sudheer Babu : కొత్త సినిమాలో సుధీర్ బాబు లుక్ చూస్తే షాక్ అవుతారు.. వీడియో లీక్!

దీంతో మూవీ టీం చేసేది లేక అధికారికంగా ఆ పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పాత్ర పేరు దుర్గా అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ లో సుధీర్ బాబు బరువు పెరిగి లావుగా కనిపిస్తున్నాడు. గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ అండ్ గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి, ఇప్పుడు సడన్ గా లావుగా కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే మేకర్స్ మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కెరీర్‌లోనే మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దుర్గా పాత్రని ఇవాళ ఇంట్రడ్యూస్ చేయగా, మిగిలిన రెండు పాత్రలు.. పరుశురాం లుక్ – మార్చ్ 4న, డీజే లుక్ – మార్చ్ 7న రివీల్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఆ పాత్రల వేషధారణ ఎలా ఉండబోతుందో కూడా ఒక స్కెచ్ ద్వారా తెలియజేశారు. పరుశురాం గుబురు గడ్డంతో, డీజే స్టైలిష్ లుక్ లో ఉండబోతున్నట్లు ఆ స్కెచ్ చూస్తుంటే అర్ధమవుతుంది. కాగా ఈ సినిమాని టాలీవుడ్ నటుడు మరియు రైటర్ హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిర్నాళిని రవి హీరోయిన్ గా నటిస్తుంది.