Vijay Devarakonda : విజయ్-రష్మిక నిజంగానే డేటింగ్ లో ఉన్నారా??

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోంది, ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది, అందుకే చాలా సార్లు ముంబైలో కెమరా కంటబడ్డారు. గోవాలో న్యూయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని..................

Vijay Devarakonda : విజయ్-రష్మిక నిజంగానే డేటింగ్ లో ఉన్నారా??

Rashmika Vijay

Vijay Devarakonda :  రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోంది, ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది, అందుకే చాలా సార్లు ముంబైలో కెమరా కంటబడ్డారు. గోవాలో న్యూయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలసి రెండు సినిమాలు చేశారు ఇద్దరూ కలవడానికి ఎన్నో పనులుంటాయి, డేటింగ్ వార్తలన్నీ గాసిప్సే అనుకున్నాం అప్పుడు. కాని ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీఖాన్, జాన్వీ కపూర్ మాటలు విన్నాక ఈ ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నిజంగానే ఉందని అంటున్నారు.

కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ లో రెండో ఎపిసోడ్ లో సారా అలీఖాన్, జాన్వి కపూర్ ఇద్దరూ గెస్టులుగా పాల్గొన్నారు. వాళ్ల రిలేషన్ షిప్స్ గురించి, కెరీర్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. దీంతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని కూడా చెప్పారు. దీనికి రౌడీ కూడా రిప్లై ఇచ్చారు. అలాగే ఈ షోలో మరో ఆసక్తికర విషయాన్నీ తెలియచేశారు. వాళ్లిద్దరూ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలి అనుకుంటున్నారని కానీ ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుందని చెప్పారు. దీంతో అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో మరోసారి విజయ్, రష్మికల డేటింగ్ న్యూస్ మళ్లీ హైలెట్ అయ్యింది.

Chaithu-Akhil : అన్న క్లాస్ – తమ్ముడు మాస్.. బ్లాక్ బస్టర్ ఎవరిదో?

డియర్ కామ్రేడ్, గీతగోవిందం సినిమాలతో రష్మిక, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జోడి అందరికీ నచ్చింది. ఈ ఇద్దరి మధ్యా లవ్ ఎఫైర్ వార్తలతో కొన్నాళ్లు దూరంగా గడిపారు. తర్వాత ఆ మధ్య ఈ ఇద్దరి ర్యాపో చూసి వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని బాలీవుడ్ మీడియా కూడా రాసింది. ముంబైలో చాలాసార్లు రౌడీబాయ్ తో డిన్నర్ డేట్ ఎంజాయ్ చేసింది రష్మిక. లైగర్ షూటింగ్ టైమ్ లో ఒకసారి ఈ ఇద్దరూ కలిసి కనిపించారు, జిమ్ చేస్తూ మరోసారి కెమరా కంటబడ్డారు, న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఈ జంట వేసిన గోవా ట్రిప్ కూడా వీళ్ల మధ్య రిలేషన్ కి సంకేతంగా కనిపించింది. రష్మిక సంక్రాంతి సెలబ్రేషన్ కూడా విజయ్ ఇంట్లోనే జరిగిందనే వార్తలు వినిపించాయి.

 

హైదరాబాద్, ముంబై, గోవా అనే తేడా లేకుండా ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టినా, విజయ్, రష్మికా రిలేషన్ షిప్ మ్యాటర్ గురించి ముంబై మీడియాలో వార్తలు వచ్చినా, గతంలో ఓసారి మాది స్నేహం మాత్రమే అని రౌడీబాయ్ తేల్చేయడంతో ఇక్కడి ప్రేక్షకులు అంత వీళ్ల బంధం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అటు రష్మిక కూడా తానెవ్వరితోనూ లవ్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి మధ్యా ఉన్నది కేవలం స్నేహం అని చెప్పింది. కానీ తాజాగా బాలీవుడ్ హీరోయిన్స్ సారా, జాన్వీ.. రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తున్నారు అనడంతో మరోసారి వీళ్లిద్దరు హైలెట్ అవుతున్నారు. మరి దీనిపై వీళ్ళిద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.