James: పునీత్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. జేమ్స్ ఫస్ట్ లుక్ చూశారా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

James: పునీత్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. జేమ్స్ ఫస్ట్ లుక్ చూశారా?

James

James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న పునీత్.. ఇక సినిమాలకి మించి చేసిన అనేక సేవ కార్యక్రమాలు ఆయనను మహోన్నతవ్యక్తిగా నిలిపాయి. పునీత్ మరణానికి ముందు చివరగా యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

కాగా, ఆయన చనిపోయే సమయానికి జేమ్స్, ద్విత్వ అనే సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో జేమ్స్ సినిమా పునీత్ చనిపోయే నాటికే పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. మార్చి 17న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Chiranjeevi: మెగా లైనప్.. చిరుత లాంటి చిరు దూకుడు!

చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించగా.. రిపబ్లిక్ డే సందర్భంగా జేమ్స్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పునీత్ మిలిటరీ డ్రెస్ లో చేతిలో గన్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోండగా.. అప్పూని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. కాగా, ఈ సినిమా విడుదల తర్వాత వారం రోజుల పాటు మరో సినిమా రిలీజ్ కాకుండా కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.