Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ! Mass Raja Raviteja attack on Bollywood .. Entry as Khiladi!

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

నిన్న కాక మొన్నొచ్చి కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోలు బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి మాస్ మహారాజాగా ఇన్నేళ్ల కెరీర్ ఉన్న రవితేజకి ఏం తక్కువ..? అందుకే లేట్ అయినా..

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

Raviteja: నిన్న కాక మొన్నొచ్చి కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోలు బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి మాస్ మహారాజాగా ఇన్నేళ్ల కెరీర్ ఉన్న రవితేజకి ఏం తక్కువ..? అందుకే లేట్ అయినా లేటెస్ట్ గా అయినా క్రేజీ థాట్ వచ్చింది ఈ సీనియర్ హీరోకి. అందుకే.. ఖిలాడి సినిమాని హిందీలో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

లాస్ట్ ఇయర్ ఈ టైమ్ కి క్రాక్ సక్సెస్ తో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు రవితేజ.. ఇప్పుడు కూడా ఖిలాడి రిలీజ్ అవుతోందని ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు మాస్ మహారాజా. రమేష్ వర్మ డైరెక్షన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఖిలాడి సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది.

Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

రవితేజ డ్యూయల్ రోల్ లో ఫిబ్రవరి 11న రిలీజ్ అవ్వబోతున్న ఖిలాడి మూవీని బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ సినిమాల లిస్ట్ లోకి ఖిలాడిని కూడా యాడ్ చెయ్యలని చూస్తోంది ఈ ప్రొడక్షన్ హౌజ్. అందుకే ఖిలాడిని గ్రాండ్ గా హిందీలో కూడా రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

తెలుగులో హిట్ అయిన రవితేజ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడమే కాకుండా రవితేజ డబ్బింగ్ సినిమాలు కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి బాగానే దగ్గరయ్యాయి. ఇప్పటికే మంచి ఇమేజ్ ఉన్న రవితేజ.. ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ ,పుష్ప క్రేజ్ లో ఉన్న బాలీవుడ్.. అదే ఊపులో ఖిలాడి ని కూడా మంచి హిట్ చేస్తుందన్న ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు ఖిలాడి టీమ్.

×