Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

ఆల్ ఓవర్ ఇండియా అంతా ఎక్కడ చూసినా సౌత్ హవానే నడుస్తోంది. సౌత్ హీరోలు బాలీవుడ్ లో అక్కడి హీరోలను మించి బ్లాక్ బస్టర్ లుకొడుతుంటే.. అంతకంటే సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల్ని..

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

Akhanda

Akhanda: ఆల్ ఓవర్ ఇండియా అంతా ఎక్కడ చూసినా సౌత్ హవానే నడుస్తోంది. సౌత్ హీరోలు బాలీవుడ్ లో అక్కడి హీరోలను మించి బ్లాక్ బస్టర్ లుకొడుతుంటే.. అంతకంటే సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల్ని బాలీవుడ్ లో అర్జెంటుగా రీమేక్ చెయ్యడానికి అక్కడి హీరోలు తెగ పోటీపడుతున్నారు. లేటెస్ట్ గా తెలుగులో సూపర్ హిట్ అయిన అఖండని హిందీలో రీమేక్ చెయ్యడానికి బాలీవుడ్ హీరోల మధ్య గట్టిపోటీనడుస్తోంది.

Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

ఇలా అదిరిపోయే యాక్టింగ్ తో అదరగొట్టే డైలాగ్స్ తో అఖండ సినిమాతో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చారు బాలయ్య. కోవిడ్ సెగ తగులుతున్నా కూడా.. ఏదైతే అదైందని ధైర్యంగా ధియేటర్లోకొచ్చిన బాలయ్య.. అఖండవిజయం అందుకున్నారు. ధియేటర్ నుంచి ఓటీటీకి షిఫ్ట్ అయినా కూడా అక్కడ కూడానెంబర్ వన్ ప్లేస్ లోనే కంటిన్యూ అవుతోంది అఖండ మూవీ. ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది కాబట్టే బాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమా మీదే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

ప్రజెంట్ టాలీవుడ్ హవా బాలీవుడ్ లో ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతోంది. బాలయ్య అఖండ హిట్ మోత బాలీవుడ్ కి కూడా చేరడంతో.. అఖండ సినిమా రీమేక్ నేనుచేస్తానంటే.. నేను చేస్తానంటూ తెగ పోటీపడుతున్నారు బాలీవుడ్ హీరోలు. అఖండలో అఘోరా రోల్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. బాలీవుడ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యగలిగే.. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ లు ఇద్దరూ అఖండ మీదే కన్నేశారు.

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

తానాజీ, శివ లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తూ.. మళ్లీ వరసగా హిట్స్ కొడుతున్న అజయ్ దేవ్ గన్.. అఖండ లాంటి ఇంట్రస్టింగ్ మూవీ చేసి మరో హిట్ కొడదామని ఆశపడుతున్నారు. ఇక ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి ఎప్పుడూ రెడీ గా ఉండే అక్షయ్ కుమార్ కూడా అఖండతో బాలీవుడ్ లో మరో సక్సెస్ అకౌంట్ లో వేసుకుందామనుకుంటున్నారు. అందుకే అటు అజయ్, ఇటు అక్షయ్ ఇద్దరూ అఖండ సినిమా నాకు కావాలంటే.. నాకు కావాలని పోటీ పడుతున్నారని టాక్. మరి ఈ ఇద్దరి హీరోల్లో బాలయ్యని బాలీవుడ్ లో రీప్లేస్ చెయ్యగలిగేదెవ్వరో చూడాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే.