Pawan Kalyan Kondagattu : కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథం వారాహికి పవన్ పూజలు చేశారు.

Pawan Kalyan Kondagattu : కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

PAWAN (1)

Pawan Kalyan Kondagattu : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథం వారాహికి పవన్ పూజలు చేశారు. ఆలయం వద్దకు జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా వచ్చారు. కొండగట్టులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాచుపల్లి శివారులోని రిసార్టులో జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించి దిశానిర్ధేశం చేస్తారు. నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. కొండగట్టులో పూజలు, నాచుపల్లిలో పార్టీ నేతలతో మీటింగ్ తర్వాత అదే రోజున నారసింహ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు.

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

32 నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీలక్ష్మీ నారసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. ధర్మపురిలో సాయంత్రం 5 గంటలకు జనసేన కార్యదర్శులతో పవన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.