Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు.

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ స్వయంగా హాజరుకానున్నారు. పూజా కార్యక్రమాల్లో పవన్ పాల్గొననున్నారని జనసేన నేతలు తెలిపారు.

అలాగే త్వరలో విజయవాడ కనకదుర్గ టెంపుల్ లో కూడా వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ నేరుగా పూజా కార్యక్రమాలు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ లో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయని జనసేన నాయకులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేయడానికి జనసేన సిద్ధమవుతోంది.

Also Read..Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్

వారాహి.. ఏపీలో ఎన్నికల ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్న ప్రత్యేక ప్రచారం వాహనం. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సిన విధంగా తయారు చేయించకున్నారు. ఈ ప్రచారం వాహనంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎన్నికలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు.ఈ వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు పవన్ కల్యాణ్. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు.

కాగా, పవన్ ఎన్నికల ప్రచారం రథం వారాహి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ వారాహి టార్గెట్ గా అధికార వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్‌‌ రంగును పవన్ తన వారాహి వాహనానికి ఉపయోగించారని.. ఆ వాహనం రంగు మార్చాలని వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ రంగు వాడకూడదని ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ కు ఆ మాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. ఈ రంగును మార్చి పసుపు రంగు వేసుకోవాలని ఎద్దేవా చేశారు. అది వారాహి కాదని.. నారాహి అని తమదైన శైలిలో సెటైర్లు వేశారు.

Also Read..Janasena ‘Varahi’ : పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌కు అనుమతి..

వారాహి విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇది ఇలా ఉంటే.. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్టీఏ) అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు. వారాహి కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామన్నారు అధికారులు.