Shiva Karthikeyan : ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో తమిళ్ స్టార్ హీరో

శివ కార్తికేయన్ హీరోగా 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించబోతున్నాడు. తమిళ, తెలుగులో ద్విభాష చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించి మూవీ కాన్సెప్ట్...

Shiva Karthikeyan : ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో తమిళ్ స్టార్ హీరో

Shiva Karthikeyan

Shiva Karthikeyan :    ఇటీవల తమిళ్ స్టార్ హీరోలు తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. వాటినే తెలుగు, తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్టు గా తెరకెక్కిస్తున్నారు. ఎంతో మంది తమిళ్ హీరోలు తెలుగులోనూ స్టార్ డం తెచ్చుకున్నారు. అలాంటి స్టార్ హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఇటీవలే ‘డాక్టర్’ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయం సాధించారు. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు శివ కార్తికేయన్.

శివ కార్తికేయన్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది శివ కార్తికేయన్ 20వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాని ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించబోతున్నాడు. అనుదీప్ రెండో సినిమా ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించాడు. ఈ సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజయం సాధించింది. ఇప్పటికే అనుదీప్ ‘జాతిరత్నాలు’ సీక్వెల్ కి కూడా ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కంటే ముందే శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతున్నాడు.

Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

తమిళ, తెలుగులో ద్విభాష చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించి మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. యూకే లోని లండన్, మన దేశంలోని పాండిచ్చేరి నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా ‘జాతిరత్నాలు’ లాగే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవ్వనుంది.