Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

రొట్టె కోసం పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఎగేసుకుపోయినట్టుగా ఉంది ఇప్పుడు మన తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ముందు ఈ సంక్రాంతికి అరడజను సినిమాలు రావాలని చూశాయి.

Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

Bangarraju

Bangarraju: రొట్టె కోసం పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఎగేసుకుపోయినట్టుగా ఉంది ఇప్పుడు మన తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ముందు ఈ సంక్రాంతికి అరడజను సినిమాలు రావాలని చూశాయి. క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, నాగార్జున బంగార్రాజు, చిరంజీవి ఆచార్య ఇలా చాలా రావాలని చూశాయి. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ప్రకటన అనంతరం మహేష్, చిరంజీవి తప్పుకోగా మిగతా వాళ్ళు సంక్రాంతికే వస్తామన్నారు.

RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

చివరికి నిర్మాతల మండలి, సినీ పెద్దలు కలిసి పవన్ భీమ్లా నాయక్ వాయిదా వేసుకునేలా చేశారు. దీంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రావడం పక్కా అనుకోగా నాగార్జున బంగార్రాజు విషయంలో మాత్రం సంక్రాంతి అంటూనే ధీమాగా చెప్పలేదు. భీమ్లా నాయక్ వాయిదా సమయంలో కూడా బంగార్రాజు వాయిదా అంటూ వార్తలొచ్చాయి. కానీ.. నాగ్ మాత్రం వస్తా అని చెప్పలేదు.. రాను అని చెప్పలేదు. దీంతో నాగ్ ఏదో ఆలోచనతోనే వేచి చూస్తున్నాడని అనుకున్నారు. గత రెండు వారాలుగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో నాగార్జున బంగార్రాజును లైన్ లోకి తెచ్చాడు.

Shanmukh -Deepthi: అల్ ది బెస్ట్ దీపూ.. దీప్తి బ్రేకప్ మెసేజ్‌కి షణ్ముఖ్ రిప్లై!

ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే రెండు తెలుగు రాష్ట్రాలలో కావాల్సిన స్పేస్ వస్తుంది. ఇదే ఆలోచనతో ఉన్న నాగార్జునకి అనుకున్నట్లే ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో జాక్ పాట్ కొట్టినట్లింది. గురువారం ఆర్ఆర్ఆర్ వాయిదా అని రూమర్స్ మొదలవడంతోనే శుక్రవారం బంగార్రాజు టీజర్ విడుదల చేసి ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని ఘనంగా ప్రకటించేశారు.

Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

దీంతో ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్, నాగార్జున బంగార్రాజు మాత్రమే పండగ బరిలో ఉంటున్నాయి. గ్రామీణ నేపథ్యం సినిమా.. ఎక్కువ మంది క్యాస్టింగ్ సినిమా కావడంతో బంగార్రాజు ఫ్యామిలీ ఆడియన్స్ ను రాబట్టుకోడం ఈజీ అనిపిస్తుంది. మొత్తంగా నాగ్ ముందు నుండి పెట్టుకున్న అంచనాలే కరెక్ట్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.