RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడింది. జనవరి 7న రావాల్సిన ఈ సినిమా పలు రాష్ట్రాలలో కరోనా ప్రభావంతో..

RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

Rrr Postpone

RRR Postpone: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడింది. జనవరి 7న రావాల్సిన ఈ సినిమా పలు రాష్ట్రాలలో కరోనా ప్రభావంతో ఆంక్షల నేపథ్యంలో మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ఆపేసినట్లు తెలుస్తుండగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది పరిస్థితులు చెక్కబడిన అనంతరమే నిర్ణయించనున్నట్లుగా స్పష్టం చేశారు.

RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్

ఈ ఏడాది మళ్ళీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్ రావడంతో థియేటర్లను మూసి వేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నైట్ కర్ఫ్యూతో పాటు యాభై శాతం సీటింగ్ తో మాత్రమే థియేటర్లను రన్ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో కొన్ని సినిమాల రిలీజ్ అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుండగా శుక్రవారం నుండే వాయిదా వేస్తారనే సమాచారం లీకైపోయింది. శనివారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగగా మేకర్స్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చేశారు.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా పడింది. కొన్ని అనుకోని కారణాల వలన రెండు సార్లు వాయిదా పడితే కరోనా కారణంగా మరో రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలోను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న చివరికి వాయిదా అనేశారు. ” కొన్ని పరిస్థితులు మన చేతులలో ఉండవు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. మాకు వేరే ఛాయిస్ లేక మేము ఈ పనిని చేస్తున్నాము. కానీ, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాము.. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అలాగే ఉంచమని కోరుతున్నాము. మీకు ప్రామిస్ చేస్తున్నాము.. మంచి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.