RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు పీక్స్ కి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇంకాస్త్ హైప్ క్రియేట్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

Rrr

RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు పీక్స్ కి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇంకాస్త్ హైప్ క్రియేట్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అదే రేంజ్ లో ప్రమోషన్లు చేస్తున్న టీమ్.. నెవర్ బిఫోర్ క్రేజ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ట్రిపుల్ఆర్ బాక్సాఫీస్ ని రూల్ చెయ్యడానికి రెడీ అవుతోంది.

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

మరో తొమ్మిది రోజులు.. తొమ్మిదే తొమ్మిది రోజుల్లో ట్రిపుల్ఆర్ ధియేటర్లలోకి రాబోతోంది. చరణ్, ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ఆఱ్ సినిమా ఒక ఎత్తైతే.. ఈ సినిమాని ప్రమోషన్ చేస్తున్న తీరు మరో ఎత్తు. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినా.. ఏ సినిమా ట్రిపుల్ఆర్ రేంజ్ లో ప్రమోషన్లు చెయ్యలేదు. అసలు ముంబై నుంచి మొదలుపెట్టి.. చెన్నై వరకూ ట్రిపుల్ఆర్ మ్యానియా ఆడియన్స్ కి పీక్స్ లో ఉందనడానికి లేటెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లే సాక్ష్యం. డైరెక్టర్, హీరోలు అన్న తేడా లేకుండా ముగ్గురూ కలిసి ఆడియన్స్ ని తమ అల్లరితో తెగ ఎంటర్ టైన్ చేస్తున్నారు.

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

ప్రమోషన్ అంటే.. ఏదో సినిమా గురించి నాలుగు ముక్కలు చెప్పి.. సినిమా గొప్పతనాన్ని చెప్పడం కాకుండా.. ప్రతి ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా సందడి చేస్తున్నారు ట్రిపుల్ఆర్ టీమ్. ఏమాత్రం రెస్ట్ లేకుండా మొన్నటి వరకూ ముంబై లో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్లు చేసిన టీమ్.. చెన్నైలో తెగ సందడి చేసింది. ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినందుకు ఎంత లక్కీయో అంటూ తెగ మురిసిపోయారు రాజమౌళి.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

రాజమౌళే కాదు.. స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ కూడా జస్ట్ ట్రిపుల్ఆర్ ని సినిమాలా కాకుండా ఓ తపస్సులా చేస్తున్నారు. సినిమాని కూడా ఆడియన్స్ లోకి అదే రేంజ్ లో తీసుకెళుతున్నారు. ఎన్టీఆర్.. చరణ్ తో ప్రతి సీన్ ని మళ్లీ చెయ్యాలనుకుంటున్నాను. చరణ్ తో టైమ్ స్పెండ్ చెయ్యడం నాకు చాలా ఇష్టం అంటూ చరణ్ మీద ఎఫెక్షన్ ని ఆడియన్స్ తో పంచుకున్నారు.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

రామ్ చరణ్.. ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ ఇంకాస్త డెప్త్ గా షేర్ చేసుకున్నారు. తారక్ తో ఉన్న ఈ రిలేషన్ ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ తో ఉన్న రిలేషన్ కి జస్ట్ థాంక్స్ చెప్పి తక్కువ చెయ్యకూడదన్నారు. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నానని, తారక్ ని చైల్డ్ మెంటాలిటీ, లయన్ పర్సనాలిటీ అంటూ తెగ మెచ్చుకున్నారు. ఇలా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ ఈవెంట్ లా కాకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ.. దూకుడు పెంచారు ట్రిపుల్ఆర్ టీమ్.