Hyderabad Traffic Police: బ్లాక్ స్టిక్కర్స్ పై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు

Hyderabad Traffic Police: ఇటీవల హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న వరుస కారు ప్రమాదాలపై నగర వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన నేపథ్యంలో బ్లాక్ స్టిక్కర్స్ తో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్స్ తో పాటు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్, బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లోవాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పోలీసులు.

Also Read:Telangana: తెలంగాణలో ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

జూబిలీహిల్స్ పరిధిలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బ్లాక్ ఫిల్మ్ తో తిరుగుతున్న వాహనాలని తనిఖీ చేసిన పోలీసులు ఫిల్మ్ లను తొలగిస్తున్నారు. నిబంధనలు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడకంపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద 180 కేసులు నమోదు చేశారు. బ్లాక్ ఫిలిం తొలగించడంపై కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: Telangana : కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి స్పందన కరువు, వీహెచ్, జగ్గారెడ్డిలు హాజరు

బ్లాక్ ఫిల్మ్, స్పెషల్ స్టిక్కర్స్ ఉన్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సిఐ ముత్తు 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాహనదారులు కచ్చితంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని సీఐ ముత్తు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో ఎమ్మెల్యే స్టిక్కర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ముత్తు తెలిపారు. ఇందులో నాంపల్లి ఎమ్మెల్యే మేరజ్ హుసేన్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్టిక్కర్ స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. డేట్ ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్స్ ను వారి స్నేహితులు కార్లకు అతుకించుకొనితిరుగుతున్నారని ఇలా చేయడం కరెక్ట్ కాదని ట్రాఫిక్ సీఐ ముత్తు వివరించారు.

Also Read: TS Intermediate : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. 15 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించండి

ట్రెండింగ్ వార్తలు