Junior NTR : హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్

కొన్ని సార్లు కష్టాల్లో ఉన్న అభిమానులని కలిసి ధైర్యం చెప్తారు. తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఓ మంచి పని చేసి మరోసారి అభిమానుల నుండి మెప్పు పొందుతున్నారు.

Junior NTR : హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్

Ntr

Junior NTR :  సినీ హీరోలు అప్పుడప్పుడు తమ అభిమానుల కోసం మంచిపనులు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు కష్టాల్లో ఉన్న అభిమానులని ఆదుకుంటారు. కొన్ని సార్లు కష్టాల్లో ఉన్న అభిమానులని కలిసి ధైర్యం చెప్తారు. తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఓ మంచి పని చేసి మరోసారి అభిమానుల నుండి మెప్పు పొందుతున్నారు.

ఫ్యాన్స్ అంటే విపరీతమైన ప్రేమ చూపించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ఆ ప్రేమని ప్రూవ్ చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి అనే తన అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడారు ఎన్టీఆర్. ఇటీవలే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై 2 కిడ్నీలు పోగొట్టుకున్న మురళి ప్రస్తుతం విజయవాడ రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Fariya Abdullah : రోడ్డు మీద తీన్మార్ డ్యాన్స్ వేసిన హీరోయిన్

తనకు ఎన్టీఆర్ ను చూడాలని ఉందని ఓ పేపర్ పై రాసి డాక్టర్లకు ఇచ్చాడు. ఈ విషయాన్ని తోటి అభిమానులు ఎన్టీఆర్ వరకు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్ వీడియో కాల్‌లో మురళితో, డాక్టర్లతో, మురళి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకున్నాక కలుద్దామని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొస్తావని ధైర్యం చెప్పారు తారక్.