Kajal Agarwal : నిర్మాతగా కాజల్.. కొత్త హీరోతో ప్రయోగం..

కాజల్ ఒక పక్క సినిమాలు చేస్తూ, మరో పక్క భర్త బిజినెస్ ని కూడా చూస్తూ, ఇప్ప్పుడు నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేరుతో కాజల్ అగర్వాల్

Kajal Agarwal : నిర్మాతగా కాజల్.. కొత్త హీరోతో ప్రయోగం..

Kajal

Kajal Agarwal :  సౌత్ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా, ఇటీవల పెళ్లి అయినా ఇంకా స్టార్ గానే ఉంది. ఇంకా చాలా సినిమాలు చేస్తుంది. సౌత్ లో అన్ని భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది కాజల్. గత సంవత్సరం ముంబైకి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు వరుసగా చేస్తూనే ఉంది. తాజాగా కాజల్ నిర్మాతగా మారబోతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పుడు అదే కోవలో ఈ చందమామ కూడా చేరింది. కాజల్ ఒక పక్క సినిమాలు చేస్తూ, మరో పక్క భర్త బిజినెస్ ని కూడా చూస్తూ, ఇప్ప్పుడు నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది.

Allu Arjun : నా ఫ్రెండ్ బన్నీ అంటే నాకు అసూయ : మంచు విష్ణు

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా రెండో సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా పేరు ‘మను చరిత్ర’. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించారు కాజల్. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేరుతో కాజల్ అగర్వాల్ ఈ సినిమాని సమర్పిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటిస్తుంది. ఇకపై భవిష్యత్తులో కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మిస్తానని తెలిపింది. హీరోయిన్ గా స్టార్ డం సంపాదించినా కాజల్ నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.