Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి పట్టాలెక్కిస్తున్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే కెరీర్‌లో తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే..?

Kalyan Ram Amigos Enno Rathrulostaayi Song Update

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి పట్టాలెక్కిస్తున్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే కెరీర్‌లో తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Kalyan Ram: బాలయ్య సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్‌ను పట్టుకొస్తున్న కళ్యాణ్ రామ్

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్‌గా నిలిచిన ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సాంగ్ అప్డేట్‌ను ప్రకటించింది అమిగోస్ చిత్ర యూనిట్. ఈ రీమిక్స్ సాంగ్‌ను జనవరి 29న సాయంత్రం 5.09 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలియజేశారు.

Kalyan Ram : కొత్త కథలు, పాత్రల వైపు కళ్యాణ్ రామ్ ప్రయాణం..

ఇక ఈ రీమిక్స్ సాంగ్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో, ఈ పాటకు మంచి ఆదరణ దక్కడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.