Kalyan Ram : కొత్త కథలు, పాత్రల వైపు కళ్యాణ్ రామ్ ప్రయాణం..

‘పటాస్’ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత దాదాపు ఏడేళ్లు ఎదురు చూస్తే గాని బింబిసార రూపంలో మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు కళ్యాణ్ రామ్ కు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో కళ్యాణ్ రామ్ మరింత సెట్టిల్డ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బింబిసార’ కు.........................

Kalyan Ram : కొత్త కథలు, పాత్రల వైపు కళ్యాణ్ రామ్ ప్రయాణం..

Kalyan Ram lineup with different kind of movies

Kalyan Ram :  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ గానే ఉంటూ వస్తుంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఒక హిట్ కొన్ని ఫ్లాప్స్ అన్నట్టే సాగుతుంది. అయినా కొత్త కొత్త కథలతో అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తాడు కళ్యాణ్ రామ్. ఓ పక్క రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘బింబిసార’ మూవీతో చాన్నాళ్ళకు సూపర్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్ తో నెక్స్ట్ మూవీస్ విషయంలోనూ ఇన్నోవేటివ్ గా వెళ్ళాలని డిసైడయ్యాడు.

‘పటాస్’ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత దాదాపు ఏడేళ్లు ఎదురు చూస్తే గాని బింబిసార రూపంలో మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు కళ్యాణ్ రామ్ కు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో కళ్యాణ్ రామ్ మరింత సెట్టిల్డ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బింబిసార’ కు సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ‘అమిగోస్’ అనే మరో వెరైటీ సినిమాతో వస్తున్నాడు. ‘బింబిసార’ మూవీలో డ్యూయల్ రోల్స్ తో చెలరేగిన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ లో ట్రిపుల్ రోల్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. ఫిబ్రవరి 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఒకే పోలికతో ఒకరికొకరు సంబంధం లేని వేరు వేరు ప్రాంతాలకు చెందిన ఓ ముగ్గురు కలిసి చేసే జర్నీలో వారిలోని ఒకరి వల్ల మిగతా ఇద్దరూ ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేశారు? అన్నదే ఈ సినిమా కథాంశం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘బింబిసార’ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ ఇమేజ్ ను ‘అమిగోస్’ తో క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు టీజర్ రిలీజైనప్పటి నుంచీ ట్రెండింగ్ అవుతున్నాయి. యన్టీఆర్ ‘జైలవకుశ’ తరహాలో మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఆల్రెడీ ‘బింబిసార’ లో కళ్యాణ్ రామ్ నెగెటివ్ రోల్ చేసి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి తన విలనిజాన్ని చూపించబోతున్నాడు. మరి ‘అమిగోస్’ అతడికి మరో సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.

Pathaan : సంక్రాంతి నుంచి పడిపోతున్న PVR స్టాక్ ప్రైజ్.. పఠాన్ దెబ్బతో మళ్ళీ ఫామ్ లోకి..

అమిగోస్ తర్వాత కూడా డెవిల్ అనే మరో స్పై, ఏజెంట్ తరహా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా వరుసగా వెంటవెంటనే డిఫరెంట్ సినిమాలు చేసి హిట్స్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో వచ్చిన సక్సెస్ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.