Pathaan : సంక్రాంతి నుంచి పడిపోతున్న PVR స్టాక్ ప్రైజ్.. పఠాన్ దెబ్బతో మళ్ళీ ఫామ్ లోకి..

పఠాన్ సినిమా క్రేజ్ ఇప్పుడు PVR కి కలిసొచ్చింది. సంక్రాంతి తర్వాత దారుణంగా 1600 కి పడిపోయిన PVR షేర్ ధర పఠాన్ బుకింగ్స్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచింది..........................

Pathaan : సంక్రాంతి నుంచి పడిపోతున్న PVR స్టాక్ ప్రైజ్.. పఠాన్ దెబ్బతో మళ్ళీ ఫామ్ లోకి..

Pathaan movie increasing PVR Stock Price Indirectly

Pathaan :  సినిమాలకి, స్టాక్, షేర్ మార్కెట్ కి కూడా అప్పుడప్పుడు సంబంధం ఉంటాయి. కొన్ని వ్యాపార సంస్థలు నిర్మాణ సంస్థలుగా మారి సినిమాలు నిర్మిస్తాయి. అవి నిర్మించే సినిమాల బట్టి కూడా వాటి షేర్ మార్కెట్ వ్యాల్యూ మారిపోతూ ఉంటుంది. ఇక దేశంలోని టాప్ మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్ అయిన PVR కంపెనీ షేర్ మార్కెట్ అయితే పూర్తిగా సినిమాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఎక్కువ సినిమాలు రిలీజయి, ఎక్కువ హిట్స్ సాధిస్తే PVR షేర్ వ్యాల్యూ అంత పెరుగుతుంది.

PVR మల్టీప్లెక్స్ సంస్థ షేర్ వ్యాల్యూ గత కొన్ని రోజులుగా 1600 నుండి 1700 మధ్య ఊగుతుంది. సంక్రాంతికి తెలుగు, తమిళ్ లో భారీ సినిమాలు రిలీజయి మంచి విజయం సాధించడంతో PVR షేర్ వ్యాల్యూ ఏకంగా 1750 కి పైగా వెళ్ళింది. ఆ తర్వాత సంక్రాంతి నుంచి ఇప్పటివరకు ఏ సినీ పరిశ్రమలలోను పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో PVR వ్యాల్యూ 1600 కి పడిపోయింది.

అయితే షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో PVR లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పఠాన్ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అంటే సినిమా కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Chandrabose : నా మనసులోని భావాలే ‘నాటు నాటు’.. ఆస్కార్ నామినేషన్ పై చంద్రబోస్ రియాక్షన్..

పఠాన్ సినిమా క్రేజ్ ఇప్పుడు PVR కి కలిసొచ్చింది. సంక్రాంతి తర్వాత దారుణంగా 1600 కి పడిపోయిన PVR షేర్ ధర పఠాన్ బుకింగ్స్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచింది. 1678 వరకు PVR షేర్ ధర వెళ్ళింది. ఆ రేంజ్ లో పఠాన్ సినిమాతో PVR కి బాగా కలిసొచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గుతాయి కాబట్టి మళ్ళీ ప్రస్తుతం PVR షేర్ ధర 1650 – 1670 మధ్య ఊగిసలాడుతుంది. మొత్తానికి సినిమాలు లేక పడిపోయిన PVR షేర్ ధరని పఠాన్ సినిమాతో షారుఖ్ పైకి లేపాడు.