Kamal Haasan : అమితాబ్ బచ్చన్ నటించిన ఆ సినిమా, నిర్మాతలపై నాకెంతో ద్వేషం కలిగింది..
హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ లో కమల్ హాసన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ.. అమితాబ్ నటించిన ఒక సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాతల గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.
Kamal Haasan : ప్రభాస్ (Prabhas) హీరోగా, కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్లు ఈ మూవీకి కల్కి (Kalki 2898 AD) అని టైటిల్ నే ఖరారు చేశారు. ఇదే ఈవెంట్ లో ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అనంతరం మూవీ టీం అంతా అక్కడి ఆడియన్స్ అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.
Prabhas : ఎన్టీఆర్, చరణ్‌తో సినిమా ఉంటుంది.. ప్రభాస్ చేసిన కామెంట్స్ మహాభారతం గురించేనా..?
ఈ ఇంటరాక్షన్ లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వీడియో కాల్ ద్వారా హాజరయ్యాడు. ఇక ఈ వీడియో కాల్ లో అమితాబ్ కమల్ సినిమాలు గురించి మాట్లాడగా, కమల్ హాసన్ దానికి బదులిస్తూ.. అమితాబ్ సూపర్ హిట్ మూవీ షోలే (Sholay) చూసి తనకి చాలా ద్వేషం కలిగిందని చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో షోలే సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ మూవీ చూసిన రాత్రి కమల్ కి నిద్ర పట్టలేదట. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ, మేకింగ్ అండ్ నటీనటుల యాక్టింగ్ చూసి తనకెంతో ద్వేషం కలిగిందట. ముఖ్యంగా ఆ సినిమా నిర్మాతలను చాలా ద్వేషించినట్లు చెప్పుకొచ్చాడు.
Sai Dharam Tej : అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో సాయిదరమ్ తేజ్ ప్రత్యేక పూజలు..
ఎందుకంటే అలాంటి గొప్ప చిత్రంలో పని చేసే అవకాశం తనకి కల్పిచినందుకు. ఆ మూవీ కమల్ హాసన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. షోలే వంటి సినిమాలు అమితాబ్ చాలానే చేసారని, అలాంటి యాక్టర్ తన సినిమాల గురించి గొప్ప మాటలు మాట్లాడడం తనకి ఎంతో సంతోషాన్ని కలగజేసినట్లు కమల్ పేర్కొన్నాడు. అమితాబ్ అండ్ కమల్ హాసన్ గతంలో ఒక సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ K లో నటిస్తున్నారు.