Prabhas : ఎన్టీఆర్, చరణ్‌తో సినిమా ఉంటుంది.. ప్రభాస్ చేసిన కామెంట్స్ మహాభారతం గురించేనా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ ప్రభాస్ కలిసి ఒక సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా హాలీవుడ్ మీడియాతో తెలియజేశాడు.

Prabhas : ఎన్టీఆర్, చరణ్‌తో సినిమా ఉంటుంది.. ప్రభాస్ చేసిన కామెంట్స్ మహాభారతం గురించేనా..?

Prabhas said he will work with NTR and Ram Charan

Updated On : July 21, 2023 / 3:32 PM IST

Prabhas : ప్రభాస్ (Prabhas) హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీ దత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ మూవీకి అందరూ ఊహించినట్టే కల్కి (Kalki 2898 AD) అని పెట్టారు. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో ఈ టైటిల్ ని గ్రాండ్ రివీల్ చేశారు. అలాగే మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అనంతరం ప్రభాస్ అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో విలేకర్లు.. RRR స్టార్స్ ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి వర్క్ చేస్తారా? అని ప్రశ్నించారు.

Sai Dharam Tej : అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో సాయిదరమ్ తేజ్ ప్రత్యేక పూజలు..

ప్రభాస్ బదులిస్తూ.. “హా కచ్చితంగా. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు నా ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిసి పని చేస్తాం. మా కాంబినేషన్ లో కచ్చితంగా ఒక సినిమా ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ మాటలు విన్న నెటిజెన్స్.. డార్లింగ్ మహాభారతం ప్రాజెక్ట్ గురించే మాట్లాడాడు అని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతాన్ని తెరకెక్కిస్తాను అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా గ్లింప్స్ పై సెలబ్రిటీస్ ట్వీట్స్..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ తరువాత మహాభారతం మొదలుపెట్టబోతున్నాడు అంటూ ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కామెంట్స్ మహాభారతం ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, మహాభారతంలో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఏ పాత్రల్లో నటించబోతున్నారో అన్ని చర్చ మొదలైంది.