Kamal Haasan : 28 ఏళ్ళ తర్వాత కమల్ డైరెక్ట్ తెలుగు సినిమా.. ప్రాజెక్ట్ K సినిమాపై స్పెషల్ లెటర్ రాసిన లోకనాయకుడు..
కమల్ హాసన్ 1995లో చివరిసారిగా తెలుగులో డైరెక్ట్ గా శుభసంకల్పం అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.
![Kamal Haasan : 28 ఏళ్ళ తర్వాత కమల్ డైరెక్ట్ తెలుగు సినిమా.. ప్రాజెక్ట్ K సినిమాపై స్పెషల్ లెటర్ రాసిన లోకనాయకుడు.. Kamal Haasan : 28 ఏళ్ళ తర్వాత కమల్ డైరెక్ట్ తెలుగు సినిమా.. ప్రాజెక్ట్ K సినిమాపై స్పెషల్ లెటర్ రాసిన లోకనాయకుడు..](https://10tv.in/wp-content/uploads/2023/06/kamal-haasan-1.jpg)
Kamal Haasan Special Letter on Project K Movie
Project K : నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారని గతంలోనే ప్రకటించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ప్రాజెక్ట్ K సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కమల్ విలన్ రోల్ అని సమాచారం. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ 1995లో చివరిసారిగా తెలుగులో డైరెక్ట్ గా శుభసంకల్పం అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.
Adipurush : కలెక్షన్స్ కోసం ఆదిపురుష్ నిర్మాతల పాట్లు.. టికెట్ రేట్లు మరింత తగ్గించారుగా..
ఇక ప్రాజెక్ట్ K సినిమాలో కమల్ నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు విషెష్ చెప్తూ సినిమా టీంని కూడా అభినందించారు. ప్రాజెక్ట్ K సినిమాలో నటించడంపై స్పందిస్తూ కమల్ హాసన్ తాజాగా ఓ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ లెటర్ లో.. 50 ఏళ్ళ క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సినీ నిర్మాణంలో అశ్వినీదత్ పేరు బాగా వినిపించేది. ఇప్పుడు మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ K కోసం పనిచేస్తున్నాం. నాగ్ అశ్విన్ కొత్త తరం దర్శకుడు, చాలా ట్యాలెంట్ ఉన్నవాడు. ప్రభాస్, దీపికా కుడా చాలా ట్యాలెంటెడ్ యాక్టర్స్. అమితాబ్, నేను గతంలో కలిసి పనిచేశాం. అయినా కొత్తగానే ఉంటుంది ప్రతిసారి. అమితాబ్ ప్రతి సినిమాకి తనని కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. నేను అదే బాటలో ప్రయాణిస్తున్నాను. నేను సినిమా ప్రేమికుడిని. పరిశ్రమలో కొత్త ప్రయత్నాలు చేయాలనే చూస్తాను. ఈ సినిమా విషయంలో తొలి ప్రశంస నాదే. దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరినీ నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మెప్పిస్తాడు అని కమల్ తెలిపారు. దీంతో కమల్ ట్వీట్ వైరల్ గా మారింది.
Thank you for the love Amit Ji @SrBachchan
Looking forward to collaborating with #Prabhas @AshwiniDuttCh @nagashwin7 @deepikapadukone @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms #ProjectK pic.twitter.com/kb5C87HaS3
— Kamal Haasan (@ikamalhaasan) June 25, 2023