Adipurush : కలెక్షన్స్ కోసం ఆదిపురుష్ నిర్మాతల పాట్లు.. టికెట్ రేట్లు మరింత తగ్గించారుగా..

ఇటీవల 3D స్క్రీనింగ్స్ కి 150 రూపాయలు టికెట్ రేటు ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ కేవలం బాలీవుడ్ వరకు మాత్రమే పెట్టారు. ఇది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు టికెట్ రేటు మరింత తగ్గించి కేవలం..

Adipurush : కలెక్షన్స్ కోసం ఆదిపురుష్ నిర్మాతల పాట్లు.. టికెట్ రేట్లు మరింత తగ్గించారుగా..

Adipurush movie unit decreasing ticket rates in Bollywood

Adipurush : ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై, రియాత్ర మనోజ్ పై భారీగా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. సినిమాని బ్యాన్ చేయమని కూడా కొంతమంది కోరారు. నేపాల్ లో అయితే చాలా చోట్ల ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేశారు. ఆదిపురుష్ సినిమా పూర్తిగా వివాదాల్లో నిలిచింది.

అయితే సినిమా వివాదాల్లో ఉన్నా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి మూడు రోజులు 340 కోట్ల కలెక్షన్స్ రాగా ఆ తర్వాత నుంచి మాత్రం సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇప్పటివరకు సినిమా ఇంకా 500 కోట్ల మార్క్ ని అందుకోలేదనే సమాచారం. మొదటి నాలుగు రోజులు అధికారికంగా కలెక్షన్స్ రివీల్ చేసిన చిత్రయూనిట్ ఆ తర్వాత మారం కలెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమాని అసలు పట్టించుకోవట్లేదని టాక్.

దీంతో చిత్రయూనిట్ పఠాన్ సినిమాకు వాడిన స్ట్రేటజీ వాడటానికి రెడీ అయ్యారు. పఠాన్ 700 కోట్ల కలెక్షన్స్ తర్వాత తగ్గుముఖం పట్టడంతో అప్పట్నుంచి వారానికి ఒక ఆఫర్ పెట్టి, టికెట్ రేట్లు తగ్గించి జనాలను థియేటర్స్ కి రప్పించి మొత్తానికి 1000 కోట్ల కలెక్షన్స్ రప్పించారు. ఇప్పుడు ఆదిపురుష్ కి కూడా అదే స్ట్రేటజీ వాడుతున్నారు చిత్రయూనిట్. ఇటీవల 3D స్క్రీనింగ్స్ కి 150 రూపాయలు టికెట్ రేటు ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ కేవలం బాలీవుడ్ వరకు మాత్రమే పెట్టారు. ఇది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు టికెట్ రేటు మరింత తగ్గించి కేవలం 112 రూపాయలకే 3D టికెట్ రేటు అని తాజాగా ప్రకటించారు. ఈ సరి కూడా కేవలం బాలీవుడ్ కే ఈ ఆఫర్ పరిమితం చేశారు. తెలుగులో వీకెండ్స్ లో మాత్రం బుకింగ్స్ బాగుండటంతో కేవలం బాలీవుడ్ లోనే ఈ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తుంది.

Mangli : షూటింగ్‌లో సింగర్ మంగ్లీకి గాయం.. కొన్ని రోజులు రెస్ట్..

కలెక్షన్స్ కోసం చిత్ర నిర్మాతలు ఇన్ని పాట్లు పడుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్ల టార్గెట్ తో దిగితే కనీసం 500 కోట్లు కూడా ఇంకా రాలేదని ఆదిపురుష్ సినిమాని మరోసారి విమర్శిస్తున్నారు. ఇక ఈ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ పెట్టారని చిత్రయూనిట్ ముందు నుంచి చెప్తుంది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.