MSVG Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో..

చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల జోరు (MSVG Collections ) చూపిస్తోంది.

MSVG Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో..

Chiranjeevi Mana Shankara Vara Prasad Garu two days collections

Updated On : January 14, 2026 / 11:00 AM IST
  • బాక్సాఫీస్ వ‌ద్ద మన శంకరవరప్రసాద్‌ గారు జోరు
  • రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి

MSVG Collections : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం మన శంకరవరప్రసాద్‌ గారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. న‌య‌న‌తార క‌థానాయిక. విక్టరీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చిరు కామెడీ టైమింగ్‌, అనిల్ రావిపూడి టేకింగ్, వెంక‌టేష్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డంతో తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.

వింటేజ్ చిరును చూసిన‌ట్లుగా ఉంద‌ని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల వ‌ద్ద‌కు ప‌రుగులు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో మన శంకరవరప్రసాద్‌ గారు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 120 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

Chiranjeevi : చిరంజీవితో సినిమా చేయబోతున్న మారుతి..?

ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఇక తొలి రోజు ఈ మూవీ 84 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్విట‌ర్ రివ్యూ.. న‌వ్వించేస్తున్న నవీన్ పోలిశెట్టి

సంక్రాంతి పండుగ సెల‌వులు ఇప్పుడే ప్రారంభ‌మైన నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. కేథరిన్‌ థ్రెసా, సచిన్‌ ఖేడ్కేర్ త‌దిత‌రులు నటించిన ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.