Chiranjeevi : చిరంజీవితో సినిమా చేయబోతున్న మారుతి..?

మారుతి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi ) ఒక సినిమా చేస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Chiranjeevi : చిరంజీవితో సినిమా చేయబోతున్న మారుతి..?

Gossip Garage Maruthi To Directs Megastar Chiranjeevi

Updated On : January 14, 2026 / 9:41 AM IST

Chiranjeevi : టాలీవుడ్‌లో ఇప్పుడో ఇంట్రెస్టింగ్‌ టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌తో హారర్ కామెడీ జానర్‌లో సినిమా తీసి సంక్రాంతి బరిలో నిలిచిన మారుతి.. మంచి కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను అలరించాడు. అలాంటి మారుతి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

చిరు ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మారుతీ ఫన్ ఎలిమెంట్స్‌ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్టే అంటున్నారు ఫ్యాన్స్. రాజాసాబ్ రిలీజ్ అయ్యాక మారుతి కామెడీ టచ్ ఇంకా బాగా హైలైట్ అయింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి సంక్రాంతి రేసులో దూసుకెళ్తోంది.

Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్విట‌ర్ రివ్యూ.. న‌వ్వించేస్తున్న నవీన్ పోలిశెట్టి

ఇప్పుడు మారుతీ ఎలాంటి కామెడీ స్టైల్‌తో, ఎలాంటి ఫన్ సీక్వెన్స్‌లతో మెగాస్టార్‌తో పని చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా మారుతీ కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్‌మెంట్‌ అప్పుడే మొదలైంది.

Sneha : సాంప్ర‌దాయ చీరకట్టులో సంక్రాంతి హీరోయిన్.. ఫోటోలు వైర‌ల్‌

అయితే త్వరలోనే చిరంజీవితో ఒక సినిమా చేస్తానని మారుతి ఆఫ్‌ ది రికార్డులో చెప్పాడట. అది స్పెషల్ ఫిల్మ్ అవుతుందని కూడా మారుతీ అన్నట్లు టాక్. కానీ ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ బ్లాక్‌బస్టర్ తర్వాత మారుతి ఫన్ ఫార్ములా చిరు మాస్ ఎనర్జీతో కలిస్తే మెగాస్టార్‌ ఖాతాలో మరో హిట్‌ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఈ కాంబినేషన్ అయితే మళ్లీ మెగా లెవెల్ ఎంటర్‌టైనర్ రాబోతోందని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని గాసిప్స్‌ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ ఎప్పుడు అఫీషియల్ అవుతుందో చూడాలి మరి.