IND vs NZ : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భార‌త్ బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో కీల‌క మార్పు..

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు రెండో వ‌న్డే మ్యాచ్‌లో (IND vs NZ) త‌ల‌ప‌డుతున్నాయి

IND vs NZ : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భార‌త్ బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో కీల‌క మార్పు..

Updated On : January 14, 2026 / 1:12 PM IST
  • రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే
  • టాస్ గెలిచిన కివీస్‌
  • భార‌త్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌

IND vs NZ : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వ‌న్డే గెలిచి మంచి జోష్‌లో ఉన్న భార‌త్ రెండో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్ తో రెండో వ‌న్డే మ్యాచ్‌లో (IND vs NZ) త‌ల‌ప‌డుతోంది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఇక భార‌త తుది జ‌ట్టులో కీల‌క మార్పు చోటు చేసుకుంది. తొలి వ‌న్డేలో గాయ‌ప‌డి సిరీస్ మొత్తానికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ దూరం అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆడ‌నున్నాడు.

Richest Indian cricketers : 2025లో టాప్ 5 ధ‌న‌వంతులైన భారత క్రికెటర్లు ఎవరు?

‘టాస్ ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు. టాస్ గెలిచినా కూడా మేము ముందుగా బ్యాటింగ్ చేయాల‌ని అనుకున్నాం. ఇక్క‌డ మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌ద‌ని అనుకుంటున్నాము. నిన్న కూడా ఇక్కడ మంచు లేదు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి జ‌ట్టులోకి వ‌చ్చాడు.’ అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ తెలిపాడు.

న్యూజిలాండ్ తుది జ‌ట్టు ఇదే..

డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే( వికెట్ కీప‌ర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జాకరీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్

David Warner : డేవిడ్ వార్న‌ర్ రెండో కూతురు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ పిక్స్‌.. వైర‌ల్‌

భార‌త తుది జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ