Kandikonda : సొంతగ్రామంలో కందికొండ అంత్యక్రియలు..

కందికొండ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించాలని అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఫిలిం చాంబర్ లో సందర్శనాంతరం మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు......

Kandikonda : సొంతగ్రామంలో కందికొండ అంత్యక్రియలు..

Kandikonda

 

Kandikonda :  తెలుగు సినీ గేయ రచయిత కందికొండ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించడంతో శనివారం మోతి నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ఆయన మృతదేహాన్ని తెలుగు ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు.

 

అయితే కందికొండ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించాలని అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఫిలిం చాంబర్ లో సందర్శనాంతరం మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన అంత్యక్రియలు తమ సొంతగ్రామంలో నిర్వహించాలని అనుకున్నారు. దీంతో కందికొండ అంత్యక్రియలు ఆయన సొంతగ్రామం నాగుర్లపల్లిలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన మృతుదేహాన్ని సొంతూరికి తరలించనున్నారు.

Kandikonda: విషాదం.. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత!

ఇక కందికొండ యాదగిరికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటుందని, కందికొండ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.