Kandikonda: విషాదం.. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత!

సినీ గేయ రచయిత కంది కొండ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శనివారం మోతి నగర్ లోని సాయి శ్రీనివాస్ టవర్స్ లో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా..

Kandikonda: విషాదం.. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత!

Kandikonda

Kandikonda: సినీ గేయ రచయిత కంది కొండ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శనివారం మోతి నగర్ లోని సాయి శ్రీనివాస్ టవర్స్ లో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్‌మెంట్ జరుగుతోంది. త్రోట్ క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందిస్తున్నారు. రోజూ 70వేల రూపాయలకు పైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Kandikonda : గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడూ ఉంటాం – కేటీఆర్

గతంలోనే విషయం తెలుసుకున్న మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ సాయం కూడా అందించారు. వైద్యం అందుతున్నా.. ఆయన ఆరోగ్యం మాత్రం క్షిణిస్తూ రావడంతో శనివారం మోతి నగర్ లోని తన నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు. కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం కాగా.. తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు.

Lyricist Kandikonda : ఆందోళనకరంగా గీత రచయిత కందికొండ ఆరోగ్యం..

ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.

Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాసారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.