Lyricist Kandikonda : ఆందోళనకరంగా గీత రచయిత కందికొండ ఆరోగ్యం..

తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసిన కందికొండ గిరి ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్‌తో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు..

Lyricist Kandikonda : ఆందోళనకరంగా గీత రచయిత కందికొండ ఆరోగ్యం..

Lyricist Kandikonda Health Condition Critical

Lyricist Kandikonda: ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన ముద్దు బిడ్డ, సరస్వతి పుత్రుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకుని ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్. డి. పూర్తి చేసుకొని.. తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసిన కందికొండ గిరి ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్‌తో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

కందికొండ కలం నుంచి జాలువారిన మధురమైన పాటలు..
‘జీ.హెచ్.ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట, సంక్రాంతి పాట మరియు ఎన్నో హిట్ సినిమాలైన దేశముదురు, పోకిరి, మున్నా, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాశారాయన.

గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్‌లో చికిత్స నిమిత్తం అత్యధికంగా వైద్య ఖర్చులయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ హస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్ ఛార్జెస్ ఒక రోజుకి 70,000 రూపాయలు.. (మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్ అన్ని సపరేటు)

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి వన్నె తెచ్చే పాటలు రాసిన కందికొండ గిరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున దయచేసి మనందరం కూడా మనకి తోచిన ఆర్థిక సహాయం చేద్దాం. సరస్వతి పుత్రుడిని కాపాడుకుందాం. తీవ్ర అస్వస్థతకు గురైన కందికొండకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకొంటే.. అతడి భార్య కందికొండ రమాదేవి గూగుల్ పే & ఫోన్ పే నెంబర్ 8179310687 తమకు తోచిన విధంగా సాయం చేయవచ్చు.