Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. కిమ్స్ హాస్పిటల్‌లో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లాకి చెందిన కందికొండ

Kandikonda :  చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

Kandikonda

Kandikonda : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. కిమ్స్ హాస్పిటల్‌లో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లాకి చెందిన కందికొండ ఉస్మానియా యూనివర్సీటీలో ఉన్నత చదువులను చదివి సినిమా మీద మక్కువతో గేయ రచయితగా మారారు. సినిమాతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాశారు కందికొండ. `దేశముదురు`, `పోకిరి`, `మున్నా`, `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` లాంటి ఎన్నో హిట్ సినిమాలకి పాటలు అందించారు.

MAA Elections 2021 : ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే లెజెండ్ : ‘మా’ ఎన్నికల అధికారి

చాలా రోజులుగా కందికొండ హాస్పిటల్ లోనే ఉన్నారు. గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చేశారు. గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌ కూడా రావడంతో ఈ చికిత్స కోసం రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట్లో కోలుకున్నా కందికొండ ఆరోగ్యం ప్రస్తుతం మరింత క్షీణిస్తుంది. దీంతో ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎన్నో సినిమాల్లో చాలా హిట్ పాటలు రాసిన కందికొండకి సినీ పరిశ్రమ నుంచి సహాయం అందకపోవడం గమనార్హం.