Kangana Ranaut : ఆమె సినిమాని నేను ప్రమోట్ చేయను.. దీపిక సినిమాపై కంగనా వ్యాఖ్యలు

కంగనా రనౌత్ హోస్ట్‌గా కొత్త షో చేయబోతుంది. లాక్ అప్' షో లాంచింగ్ కార్యక్రమాన్ని ముంబైలో గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి........

Kangana Ranaut : ఆమె సినిమాని నేను ప్రమోట్ చేయను.. దీపిక సినిమాపై కంగనా వ్యాఖ్యలు

Deepika

Kangana Ranaut :   బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా కొత్త షో చేయబోతుంది. ఇన్నాళ్లు సినిమాల్లో మెప్పించిన కంగనా ఇప్పుడు షోలో యాంకర్ గా మెప్పించడానికి రెడీ అయింది. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న‘లాక్‌ అప్‌’ అనే రియాల్టీ షోలో కంగనా హోస్ట్ గా చేస్తుంది. త్వరలో ఈ షో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో టెలికాస్ట్ అవ్వనుంది. ‘లాక్ అప్’ షో లాంచింగ్ కార్యక్రమాన్ని ముంబైలో గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో నిర్వహించారు.

 

ఈ విలేకర్ల సమావేశంలో కంగనా మీడియాతో ముచ్చటించింది. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి… ‘‘మేడమ్‌ ఈ మధ్య కాలంలో మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా ఎదుటివాళ్లు ఆమె ప్రవర్తనపై కామెంట్‌ చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె సైతం ఈ నెగటివిటీని ఎదుర్కొన్నారు. ‘గెహ్రియాన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ధరించిన దుస్తులపై విపరీతంగా కామెంట్లు వచ్చాయి. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు’’ అని అడిగాడు.

Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా కంగనా.. ఓటీటీ టెలికాస్ట్

దీనికి కంగనా.. ”చూడండి, తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె (దీపికాపదుకొణె) తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ఆ సత్తా ఉంది. ముఖ్యంగా, ఆమె సినిమాని ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్‌ చేయను. కాబట్టి మీరు కూర్చొండి’’ అని కంగన ఆ విలేఖరికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.