Kannada Heroins: సిల్వర్ స్క్రీన్‌పై కన్నడ భామల జోరు!

నార్త్ బ్యూటీస్ గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంటే సౌత్‌ బ్యూటీస్ మాత్రం టాలెంట్ తో వావ్ అనిపిస్తున్నారు. స్పెషల్లీ కన్నడ భామలు.. తెలుగు ఇండస్ట్రీని ఆల్ మోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారు.

Kannada Heroins: సిల్వర్ స్క్రీన్‌పై కన్నడ భామల జోరు!

Kannada Heroins

Kannada Heroins: నార్త్ బ్యూటీస్ గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంటే సౌత్‌ బ్యూటీస్ మాత్రం టాలెంట్ తో వావ్ అనిపిస్తున్నారు. స్పెషల్లీ కన్నడ భామలు.. తెలుగు ఇండస్ట్రీని ఆల్ మోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎవరు అంటే.. శాండల్ బ్యూటీ అనే చెప్తున్నారు. అంతగా ఈ మద్య హవా నడిపిస్తున్నారు ఈ కన్నడ భామలు. మన తెలుగు తెర మీద అందం మొత్తం కన్నడ మయం. ఎక్కడ చూసినా కన్నడ హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఈమద్య ఏ సినిమా చూసినా.. కన్నడ హీరోయిన్ కంపల్సరీగా కనిపిస్తోంది. ఎందుకూ అంటే.. అసలు ఆ గాలిలో, ఆ నీళ్లలో అంత మ్యాజిక్ ఉందని, అందుకే అందరికీ అంతలా నచ్చేస్తారని ఉందంటోంది కన్నడ బ్యూటీ పూజాహెగ్డే.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

అదేంటి తను బాలీవుడ్ హీరోయిన్ కదా అనుకుంటున్నారా. పూజా పేరెంట్స్ ఇద్దరూ కన్నడ వాళ్లే. పుట్టి పెరిగింది వేరే చోట అయినా.. పూజా రూట్స్ మాత్రం కర్ణాటకలోనే. ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, బన్నీతో అలవైకుంఠపురం సినిమాల్లో హీరోయిన్ గా టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్లతో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ.. గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొడుతూ తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసేస్తోంది ఈ కన్నడ కస్తూరి.

Telugu Folk Songs: ట్రెండ్ మారింది.. ఫోక్ మీద ఫోకస్ పెరిగింది!

ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న మరో కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ భామ తొలి సినిమాలోనే అందం అభినయంతోనే ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాలతోనే సక్సెస్‌ రావటంతో లక్కీ హీరోయిన్‌ ట్యాగ్‌ తొలి సినిమాతోనే సొంతం చేసుకుంది. అదే జోరులో గీత గోవిందం సినిమాతో ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో రష్మిక స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. నాని, నితిన్, మహేష్, అల్లు అర్జున్ ఇలా వరుసగా హీరోల సినిమాలతో బిజీ అయిపోయింది రష్మిక.

Pragathi: ‘నాగిని’ పాటకు ప్రగతి ఇరగదీసే స్టెప్పులు.. వీడియో వైరల్‌

కన్నడ ఇండస్ట్రీనుంచి వచ్చి తెలుగులోకి ఉప్పెనలా వచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. టీనేజ్ లోనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి బ్యాక్ టూ బ్యాక్ సినిమా ఛాన్సులు కొట్టేస్తోంది కృతి శెట్టి. ఉప్పెనతో 100కోట్ల హీరోయిన్ అయిపోయిన కృతి ప్రస్తుతం రామ్, నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది కృతి శెట్టి. టాలెంట్ ఉండాలే కానీ.. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడాలుండవు సినిమాకి. ఎప్పుడైనా పొరుగింటి పుల్లకూరే రుచి.. అందుకే మన హీరోయిన్లు ఉన్నా.. మన పొరుగు రాష్ట్రం పాపలు అంటేనే ఇక్కడి ప్రేక్షకులకు ప్రేమెక్కువ. అందుకే కన్నడభామల్ని అంతగా ఆదరిస్తున్నారు మనవాళ్లు.

Sai Pallavi: బ్యూటీ విత్ నాచురాలిటీ సాయిపల్లవి.. గ్యాలరీ

తెలుగులో వరుసగా అవకాశాలు సంపాదించుకుంటున్న మరో కన్నడ బ్యూటీ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ హీరోయిన్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటరూ, అల్లుడు అదుర్స్ రిలీజ్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ కన్నడ హీరోయిన్ వరస అవకాశాలతో మంచి సక్సెస్ అందుకుంటోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ మూవీ అయిన పెళ్లి సందడి సినిమా టైటిల్ తో రిలీజ్ అయిన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. బ్యూటి ఫుల్ లుక్స్ తో పాటు అదిరిరిపోయే గ్రేస్ తో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల.. కన్నడ అమ్మాయే. క్యూట్ గా అందంగా అంతే ఎనర్జిటిక్ యాక్టింగ్ చేసిన శ్రీలీల రవితేజ సినిమాలో నటిస్తోంది.

Sukumar Special Song’s: సుకుమార్ స్పెషల్ సాంగ్స్ అంటే కిర్రాక్కే!

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ అనుష్క. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కమర్షియల్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ డమ్ అందుకుంది. తరువాత లేడి ఓరియంటెడ్ సినిమాలకు సై అంటూ మరింత ఎత్తుకు ఎదిగింది. అరుందతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన యోగా బ్యూటి సైజ్‌ జీరో లాంటి ఎక్స పెరిమెంటల్ సినిమాలు చేసింది. ఇక బాహుబలి సినిమా అనుష్క స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్‌ చేసింది. భాగమతితో మరోసారి సత్తా చాటిన అనుష్క మరో సినిమాకు రెడీ అవుతోంది.

Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?

సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ కూడా కన్నడ ఇండస్ట్రీ కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. ఎప్పుడో ఒకసారి సినిమాలు చేసినా కూడా తెలుగింటి అమ్మాయిగా నిత్యాని ఓన్ చేసేసుకున్నారు టాలీవుడ్ జనాలు. నిత్యా లేటెస్ట్ గా స్కైలాబ్ మూవీ రిలీజ్ చేసింది అంతేకాదు.. భీమ్లానాయక్ లో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అప్పటి ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకూ శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ కి వచ్చి టాప్ పొజిషన్ సంపాదించుకున్న హీరోయిన్లు ఇలా చాలా మందే ఉన్నారు.