Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

‘పుష్ప’ తో బాలీవుడ్‌లో బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ అన్నారు..

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

Karan Johar

Pushpa Movie: తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమానే ఉదాహరణగా చూపించారు.

Pushpa : ‘పుష్ప’ పార్టీ ఇచ్చాడు..

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘పుష్ప’.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంతో బాలీవుడ్‌లో బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా కరణ్‌ జోహార్‌ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ ‘పుష్ప’కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు.

Pushpa Thank You Meet : కంటతడి పెట్టిన సుకుమార్..

‘‘ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన ‘పుష్ప’కి కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి’’ అని కరణ్‌ జోహార్‌ చెప్పారు.

Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!