Pushpa Thank You Meet : కంటతడి పెట్టిన సుకుమార్..
‘పుష్ప’ థ్యాంక్యూ మీట్‌లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..

Sukumar
Pushpa Thank You Meet: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ గత పది రోజులుగా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. తెలుగుతో పాటు విడుదల చేసిన మిగతా భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
Pushpa Thank You Meet : లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటించిన సుకుమార్..
తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలియజెయ్యడానికి మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది టీం. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!
తన కష్టంలో సగభాగం భార్య తబితకే చెందుతుందంటూ ఆమెకి థ్యాంక్స్ చెప్పారు సుకుమార్. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌కు పాదాభివందనం చేసిన సుకుమార్.. నిర్మాతల దగ్గర నుండి ఆర్టిస్టులతో పాటు ప్రతి టెక్నీషియన్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అని.. బన్నీలో గ్రేట్ ఫిలాసఫర్ వున్నాడనీ, బన్నీ‘ఆర్య’ కు నేను ఏది చెప్తే అది చేశాడు. ‘పుష్ప’ కి బన్నీ ఏం చెప్తే అది తాను చేశానని అన్నారు సుకుమార్. ఆయన మాట్లాడుతున్నంత సేపు యూనిట్ సభ్యులంతా కూడా భావోద్వేగానికి లోనయ్యారు.