Bhool Bhulaiyaa 2 : ఆ హిట్ సినిమాకు మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ ఆర్యన్.. హిట్ కోసమేనా??

కార్తీక ఆర్యన్ నుంచి భూల్ భూలయ్య 2 తర్వాత వచ్చిన ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల పఠాన్ సక్సెస్ తర్వాత వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా పరాజయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ ఆర్యన్ కు మరో హిట్ కావాలని తాజాగా.................

Bhool Bhulaiyaa 2 : ఆ హిట్ సినిమాకు మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ ఆర్యన్.. హిట్ కోసమేనా??

kartik aaryan announce sequel for Bhool Bhulaiyaa 2 movie

Bhool Bhulaiyaa 2 :  బాలీవుడ్ గత సంవత్సర కాలంగా వరుస పరాజయాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు, మూడు హిట్స్ అందుకుంది బాలీవుడ్. అందులో భూల్ భూలయ్య 2 ఒకటి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా టబు ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం మేలో రిలీజ్ అయినా భూల్ భూలయ్య 2 సినిమాని 70 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చింది. ఈ సినిమా విజయం పై కార్తీక్ ఆర్యన్, అభిమానులు, బాలీవుడ్ సంతోషం వ్యక్తం చేసింది.

కార్తీక ఆర్యన్ నుంచి భూల్ భూలయ్య 2 తర్వాత వచ్చిన ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల పఠాన్ సక్సెస్ తర్వాత వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా పరాజయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ ఆర్యన్ కు మరో హిట్ కావాలని తాజాగా భూల్ భూలయ్య 3 సినిమాని అనౌన్స్ చేశారు. భూల్ భూలయ్య 2కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.

Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?

భూల్ భూలయ్య 2 సినిమా తెరకెక్కించిన అనీస్ బజ్మీనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. భూల్ భూలయ్య 3 సినిమాని 2024 దీపావళికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో కార్తీక్ ఆర్యన్ మరో సినిమా చేస్తున్నాడు. హిట్ కోసం బాలీవుడ్ హీరోలు సీక్వెల్స్, రీమేక్స్ ఇంకా నమ్ముకుంటూనే ఉన్నారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.