God Father: చెల్లిగా కీర్తి.. తల్లిగా గంగవ్వ ఫిక్స్!

ఈ మధ్య కాలంలో దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్స్ ను మరోసారి వెండితెర మీదకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న..

God Father: చెల్లిగా కీర్తి.. తల్లిగా గంగవ్వ ఫిక్స్!

God Father

God Father: ఈ మధ్య కాలంలో దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్స్ ను మరోసారి వెండితెర మీదకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో.. ఇప్పుడు బిజీ హీరోయిన్స్ ను కూడా హీరోలకు చెల్లెలు పాత్రల కోసం ఒప్పిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో ఈ తరహా ట్రెండ్ ఉండేది. కానీ కాలం మారే కొద్దీ హీరోయిన్స్ ఈ తరహా పాత్రలకు దూరమయ్యారు.

Bigg Boss 5: నటరాజ్ అవుట్.. రొమాన్స్‌లో మునిగి తేలిన పింకీ, విశ్వ

కాగా.. ఇప్పుడు మెగాస్టార్ బోళాశంకర్ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్ ను చెల్లిగా తీసుకున్నారు. ఇక, చిరు ప్రస్తుతం ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ లో ఉండగానే మలయాళం లూసిఫర్ రీమేక్ కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. మోహన రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

RRR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. అలియా సినిమా వాయిదా తప్పదా?

ఇందులో చిరుకి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఊటిలో జరుగుతుంది. తల్లిగా గంగవ్వ నటించే వార్త నిజమైతే ఆమెకి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు.