RRR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. అలియా సినిమా వాయిదా తప్పదా?

అసలు సిసలైన క్రేజీ మల్టీస్టారర్ గా.. పాన్ ఇండియా సినిమాకు చిరునామా రాబోతున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు..

RRR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. అలియా సినిమా వాయిదా తప్పదా?

Rrr

RRR: అసలు సిసలైన క్రేజీ మల్టీస్టారర్ గా.. పాన్ ఇండియా సినిమాకు చిరునామా రాబోతున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. కరోనా ప్రభావంతో ఇప్పటి వరకు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి వారం రోజుల ముందే సందడి ప్రారంభించనుంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావడం గ్యారంటీని అని యూనిట్ తాజాగా పోస్టర్ వేసి మరీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

Janhvi Kapoor: ఆకు పచ్చని ప్రకృతిలో హొయలుపోతున్న జాన్వీ!

దర్శకుడు రాజమౌళి సహా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే.. అప్పటికే సంక్రాంతిని టార్గెట్ చేసి డేట్స్ ఖరారు చేసుకున్న సినిమాలు డైలమాలో పడిపోయాయి. తెలుగులో సంక్రాంతి కానుకగా బడా బడా సినిమాలు వస్తుండగా వాటిలో పెద్దగా మార్పులుండే అవకాశం కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత వారం వ్యవధిలో మరో మూడు భారీ తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ సమయంలోనే ప్లాన్ చేసుకున్న సినిమాలకు పెద్ద చిక్కు వచ్చింది పడింది.

Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఒక్క తెలుగులోనే కాదు.. బాలీవుడ్ మీద కూడా గట్టిగానే కనిపిస్తుంది. దీంతో అక్కడ ఆర్ఆర్ఆర్ టైంలో వచ్చే సినిమాలు వాయిదా పడకతప్పేలా కనిపించడం లేదు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన సినిమా గంగూబాయి ఖతియావాది. జనవరి 6న రిలీజ్ ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు.

Sophie Choudry: సోఫీ నీ అందం అదరహో!

కానీ, ఇప్పుడు అలియానే నటించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7 రిలీజ్ కానుంది. దీంతో గంగూభాయ్ మేకర్స్ డైలమోలో పడినట్లుగా తెలుస్తుంది. రెండిటిలో అలియానే నటించడం.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ ముందు గంగూభాయ్ నిలబడగలదా అన్న అనుమానాలు వ్యక్తమవడంతో ఈ సినిమాను ఫిబ్రవరికి షిఫ్ట్ చేసే ఆలోచనలో చేస్తున్నట్లుగా తెలుస్తుంది.