Keerthy Suresh : ఎమ్మెల్యే పక్కన హీరోయిన్ గా చేయబోతున్న కీర్తి సురేష్

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’, చిరంజీవి చెల్లెలిగా ‘భోళా శంకర్‌’, తమిళ్ లో ‘సాని కాయిదం’ సినిమాలు...

Keerthy Suresh : ఎమ్మెల్యే పక్కన హీరోయిన్ గా చేయబోతున్న కీర్తి సురేష్

Keerthy Suresh

Keerthy Suresh :   ‘మహానటి’ సినిమాతో అందర్నీ మెప్పించిన కీర్తి సురేష్ ఆ తర్వాత ఆ రేంజ్ పాత్ర ఒక్కటి కూడా చేయలేదు. ఆ సినిమా తర్వాత నుంచి హీరోయిన్ మాత్రమే కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరో పక్క సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేస్తుండటం విశేషం. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’, చిరంజీవి చెల్లెలిగా ‘భోళా శంకర్‌’, తమిళ్ లో ‘సాని కాయిదం’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం.

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ గతంలో కొన్ని సినిమాలు చేశాడు. అయితే హీరోగా అంతగా సక్సెస్ అవ్వలేదు. దీంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు క్యాబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ సినిమా చేయాలని ఉదయనిధి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు.

Suman : సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు : సుమన్

అయితే గతంలోనే సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు ఎలక్షన్స్, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని త్వరలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అడగటంతో కీర్తి ఒప్పుకుంది. దీంతో కీర్తి ఖాతాలో మరో సినిమా చేరింది. ఈ సినిమా షూటింగ్ ని వచ్చే నెలలోనే మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్‌.రెహమాన్‌ను కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది.