Suman : సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు : సుమన్

నిన్న తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. ''నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లు అవుతుంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు......

Suman : సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు : సుమన్

Suman

Suman :  తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎలక్షన్స్ సమయంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం కొన్ని రోజులు చర్చలకు దారి తీసింది. ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. తాజాగా మొన్న మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, కానీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే మాత్రం ముందుకొస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సినీ పరిశ్రమలో చర్చకి దారి తీశాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన సాయంత్రానికి మోహన్ బాబు సినిమా టికెట్ల ఇష్యూ గురించి మాట్లాడుతూ లేఖ రాయడం మరింత చర్చకి దారి తీసింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు కొంతమంది ఈ విషయంపై మాట్లాడారు.

Nani : ఆ థియేటర్లో ‘టక్కరి దొంగ’ సినిమాకి రచ్చ రచ్చ చేశాం.. ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం

నిన్న సాయంత్రం ఈ విషయంపై సినీ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు. నిన్న తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. ”నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లు అవుతుంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా రంగంలో ఐక్యత లేదనడం అవాస్తవం. పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల సమస్యను ప్రభుత్వం త్వరలో పరిష్కరించాలి” అని తెలిపారు.