Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!

టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనే.....

Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!

Keerthy Suresh Movie Selections Must Change

Keerthy Suresh: టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో సతమతమవుతోంది. కెరీర్ తొలినాళ్లలో అమ్మడి యాక్టింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో నటిస్తుందనే వార్త తెలుసుకుని, అప్పట్లో చాలా మంది నవ్వుకున్నారు కూడా. కానీ.. ఆ సినిమాలో ప్రాణంపెట్టి నటించిన కీర్తి సురేష్ అందరికీ తన నటనతో గట్టి రిప్లై ఇచ్చింది.

Keerthy Suresh: కొత్త ఫోటోలతో కవ్విస్తున్న కళావతి!

మహానటి సినిమాలో కీర్తి నటనకు ఏకంగా నేషనల్ అవార్డ్ దక్కిందంటే, ఆమె ఆ సినిమాలో ఏ రేంజ్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిందో మనకు తెలిసిందే. ఇక ఆ తరువాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే ఇక్కడే ఆమె సినిమా సెలెక్షన్ పక్కదారి పట్టింది. కేవలం లేడీ ఓరియెంటెడ్ అనే ప్రయారిటీ తప్ప, సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేది ఆమె పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ.. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ మూటగట్టుకుంది.

Keerthy Suresh: మహానటి తర్వాత దూరమైన సక్సెస్.. మహేష్ మీదే కీర్తి ఆశలన్నీ!

ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదని, రెగ్యులర్ సినిమాలు చేయాలని భావించిన కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేష బాబు ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాలో అమ్మడి పాత్ర కాస్త నెగెటివ్ టచ్ ఉన్నా పెద్దగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక కీర్తి సురేష్ నటించిన తొలి వెబ్ మూవీ ‘చిన్ని’ కూడా ఆమె స్థాయి సినిమా కాదని సినీ క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు. ఒక మీడియం రేంజ్ హీరోయిన్ ఈ వెబ్ మూవీ చేసినా రిజల్ట్ సేమ్‌గా ఉండేదని వారు అంటున్నారు.

దీంతో కీర్తి సురేష్ ఇప్పుడు తీవ్ర అయోమయంలో పడింది. అసలు తాను తప్పు ఎక్కడ చేస్తున్నానా అనే ఆలోచనలో పడింది ఈ చిన్నది. ఇప్పటికైనా సినిమా ఎంపికలో తన పంథా మార్చుకుంటే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం ఖాయమని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ ఆమెకు సలహా ఇస్తున్నారు. మరి కీర్తి సురేష్ ఇకనైనా తన సినిమా సెలెక్షన్ విషయంలో జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి.