Keerthy Suresh: మహానటి తర్వాత దూరమైన సక్సెస్.. మహేష్ మీదే కీర్తి ఆశలన్నీ!

మహానటి తర్వాత మహా పేరు తెచ్చుకుంది. సినిమా ఆఫర్స్ అదే రేంజ్ లో దక్కించుకుంది. కానీ లక్ కలిసిరాక చేసిన ప్రతీ సినిమా కీర్తిని ఫెయిల్యూర్ బ్యాచ్ లో వేసింది. అయినా సరే వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ మలయాళీ బ్యూటీకి సూపర్ స్టార్ అయినా బ్రేక్ ఇస్తాడా.. ?

Keerthy Suresh: మహానటి తర్వాత దూరమైన సక్సెస్.. మహేష్ మీదే కీర్తి ఆశలన్నీ!

Sarkaru Vaari Paata (1)

Keerthy Suresh: మహానటి తర్వాత మహా పేరు తెచ్చుకుంది. సినిమా ఆఫర్స్ అదే రేంజ్ లో దక్కించుకుంది. కానీ లక్ కలిసిరాక చేసిన ప్రతీ సినిమా కీర్తిని ఫెయిల్యూర్ బ్యాచ్ లో వేసింది. అయినా సరే వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ మలయాళీ బ్యూటీకి సూపర్ స్టార్ అయినా బ్రేక్ ఇస్తాడా.. ట్రైలర్ లో లుక్ బాగుంది.. మరి సర్కారు వారి పాట సినిమా టోటల్ గా ఈ హీరోయిన్ కు గుడ్ ఛార్మ్ తీసుకొస్తుందా..?

Keerthy Suresh: టాలీవుడ్‌లో కీర్తి జోరు.. మరో సినిమాకి సైన్?

మహానటితో కీర్తి సురేష్ పేరు ఒక్కసారిగా సౌత్ ఇండియాలో మారుమోగి పోయింది. అప్పటి నుంచి ఆఫర్స్ వెల్లువ కొనసాగుతోంది. ఆతర్వాత బ్యాడ్ లక్ ఏంటోగాని, ఈ మళయాలి బ్యూటీ సక్సెస్ కే దూరమైంది. ప్రజెంట్ పరుశురామ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ సరసన సర్కార్ వారి పాట చేస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్ తోనే ఓ రేంజ్ లో సక్సెస్ వేవ్ క్రియేట్ అయ్యింది. ట్రయిలర్ రిలీజ్ అయిన వన్ డేలోనే 5 క్రోర్స్ వ్యూస్ క్రాస్ అయింది.

Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

సౌత్ ఇండియాలో మహానటి తర్వాత కీర్తి సురేష్ సినిమా ల లిస్ట్ పెద్దదే.. పందెం కోడి 2, సర్కార్, రజినీ కాంత్ తో పెద్దన్న చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. తెలుగులో గుడ్ లక్ సఖి, నితిన్ తో రంగ్ దే లాంటి సినిమాలు కూడా కీర్తి సురేష్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. అయినా ఆఫర్స్ మాత్రం ఆగడం లేదు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

ఓటిటిలోనైనా ఈ అమ్మడు సక్సెస్ అవుతుందనుకుంటే అక్కడా అట్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఓటిటిలో పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి సినిమాలతో చేసిన ప్రయోగాలు ఫలించలేదు. దాంతో ఈ అమ్మడి ఆశలన్నీ సర్కార్ వారి పాట మీదే పెట్టుకుంది. మే 12న సూపర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లో రిలీజ్ అవుతున్న సర్కార్ వారి పాట, యుఎస్ ఏలో 603కి పైగా లొకేషన్స్ లో మే 11న రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుందనే ధీమాతో ఉంది కీర్తి సురేష్. సర్కార్ వారి పాట కీర్తి సురేష్ ఫ్లాప్ జర్నీకి బ్రేక్ లేయడం పక్కా అంటునారు మహేశ్ ఫ్యాన్స్.