Kerala : యూ ట్యూబ్ వీడియో సహాయంతో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!

మలప్పరంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొట్టకల్ రాఠా పరిధిలో 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోది.

Kerala : యూ ట్యూబ్ వీడియో సహాయంతో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!

Youtube

Kerala Girl Delivers Baby : ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక…యూ ట్యూబ్ వీడియో సహాయంతో..బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఏడుపులు విన్న ఆమె కుటుంబం ఇంట్లోకి వచ్చి చూడగా..షాక్ కు గురయ్యారు. బిడ్డ ఏడుపులు వినడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఈనెల 20వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…

Read More : HYD : లైవ్ వీడియోతో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

మలప్పరంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొట్టకల్ రాఠా పరిధిలో 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోది. ఈమె…స్థానికంగా ఉన్న 21 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. పెళ్లికి వారు అంగీకరించారు. కానీ..పెళ్లి చేసుకోవడానికి తగిన వయస్సు లేకపోవడంతో…18 ఏండ్లు నిండిన తర్వాత…వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ క్రమంలో…బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్న తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు.

Read More : ICC T20 : పాక్ విజయంపై సంబరాలు చేసుకుంటే..దేశ ద్రేహం కేసులు

ఇదిలా ఉండగా..నొప్పులు రావడంతో..ఎవరి సాయం తీసుకోకుండా..యూ ట్యూబ్ ను ఆశ్రయించింది. యూ ట్యూబ్ లో వీడియో చెప్పినట్లు చేసింది. ఇంట్లోనే బిడ్డకు జన్మినివ్వడమే కాకుండా..బొడ్డు కూడా కత్తిరించుకోవడం గమనార్హం. బిడ్డ ఏడుపులు విన్న ఆ కుటుంబం లోపలికి వచ్చి చూశారు. విషయం తెలుసుకున్న పోలీసులు…తల్లీ బిడ్డలను మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే…బాలిక గర్భం దాల్చడానికి కారణమైన ఆమె ప్రియుడిని పోలీసులు ఫోక్సో చట్టం నిబంధనల కింద బుధవారం అరెస్టు చేశారు.