KGF2: కేజీఎఫ్ చాఫ్టర్-2 రన్ టైమ్ లాక్.. సెన్సార్ రిపోర్ట్ ఇదే!

ఓ కన్నడ సినిమాగా వచ్చి కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో..

KGF2: కేజీఎఫ్ చాఫ్టర్-2 రన్ టైమ్ లాక్.. సెన్సార్ రిపోర్ట్ ఇదే!

Kgf2

KGF2: ఓ కన్నడ సినిమాగా వచ్చి కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో బాలీవుడ్ ప్రముఖులను ఎంపిక చేశారు. రవీనా టాండన్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, తెలుగు విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!

కరోనా కారణంగా పలుసార్లు విడుదల తేదీన మార్చుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. అన్ని భాషల్లో కలిపి కేవలం 24 గంటల్లోనే 109+ మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్, సెన్సార్ రిపోర్ట్ బయటకి వచ్చింది.

Kgf 2

Kgf 2

KGF2: జక్కన్న దారిలో ప్రశాంత్.. పెరిగిన కేజీఎఫ్ 2 ప్రమోషన్ల స్పీడ్!

మొత్తం 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేసిన కేజేఎఫ్ చాఫ్టర్ 2 సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను దేశంలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేస్తుండడం విశేషం. మరి కేజీఎఫ్‌-2 ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఇంకెలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.