KGF2: జక్కన్న దారిలో ప్రశాంత్.. పెరిగిన కేజీఎఫ్ 2 ప్రమోషన్ల స్పీడ్!

నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ కి తెర పడింది. ఇక అంతే ఈగర్ గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తోన్న..

KGF2: జక్కన్న దారిలో ప్రశాంత్.. పెరిగిన కేజీఎఫ్ 2 ప్రమోషన్ల స్పీడ్!

Kgf2

KGF2: నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ కి తెర పడింది. ఇక అంతే ఈగర్ గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తోన్న మరో సినిమా కెజీఎఫ్ 2. రాఖీభాయ్ ఆటిట్యూడ్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి ఉవ్విళ్లూరుతున్న ఆడియన్స్ కి కేజిఎఫ్ 2 టీమ్ థియేట్రికల్ ట్రయిలర్ తో కిక్ ఇవ్వబోతుందా? పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ ప్రమోషన్స్ హెల్ప్ కానున్నాయా? అసలు కేజీఎఫ్ 2 ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ఫుల్ డిటైల్స్ స్టోరీలో చూద్దాం.

KGF2: యష్ కోసం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా శివన్న!

4 సంవత్సరాలు ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురు చూశారు. ఆ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఇప్పుడు కేజిఎఫ్ పైకి ఫోకస్ షిఫ్ట్ చేశారు. ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 8 సినిమాల లిస్ట్ లో కేజిఎఫ్ చేరింది. దాంతో కెజిఎఫ్ చాప్టర్ 2 మీద వరల్డ్ వైడ్ ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకుని, రాఖీ భాయ్ యాక్షన్ ఎలివేషన్స్ చూసేందుకు కేజిఎఫ్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 3 సంవత్సరాల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కూడా ఆ రేంజ్ లోనే ఉండటంతో ఈ సినిమాపై మేకర్స్ తో పాటు, ఆడియన్స్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు.

KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

ఇక ఈ సినిమా ఫాన్స్ 250 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2కు డబల్ కలెక్షన్స్ వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య కేజిఎఫ్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, తుఫాన్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేయడానికి ఈనెల 27న కేజీఎఫ్2 ట్రైలర్ లాంచ్ చేయనుంది టీమ్. ఈ ట్రయిలర్ తో మాంచి కిక్ ఇచ్చి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ ఈవెంట్ ను హోస్ట్ చేయడానికి కరణ్ జోహార్ నే చూజ్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. శివరాజ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా రానున్న రాకింగ్ స్టార్ సినిమాకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

సౌత్ సినిమాలతో పాటు, సౌత్ స్టార్స్ ను ప్రమోట్ చేయడంలో ముందు వరసలో ఉంటున్నారు కరణ్ జోహార్. పాన్ ఇండియా రేంజ్ లో ఇక్కడివారు ఎదుగుతున్నారని.. నార్త్ లో కొంతమంది పెదవి విరుస్తున్నా.. కరణ్ జోహార్ మాత్రం టాలెంట్ నే చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమధ్య పుష్ప సినిమాను మెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ కు సపోర్ట్ ఇస్తూ ముంబై ఈవెంట్ లో హోస్ట్ గా మెరిసాడు. గతంలో బాహుబలి టైమ్ లో కూడా ప్రభాస్, రాజమౌళిని ఆకాశానికెత్తిన కరణ్ జోహార్. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. దాంతో ఆ సినిమాల రేంజ్ లోనే కేజిఎఫ్ 2 పై భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు ఈ సినిమా అభిమానులు.